Share News

భీమడోలు కార్యదర్శికి షోకాజ్‌ నోటీసులు

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:35 AM

పంచా యతీ నిధుల దుర్వినియోగం అభియోగంపై భీమ డోలు గ్రామ కార్యదర్శి తనూజకు జిల్లా పంచాయతీ అధికారులు షోకాజ్‌ నోటీసులు అందజేశారు.

 భీమడోలు కార్యదర్శికి షోకాజ్‌ నోటీసులు

భీమడోలు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పంచా యతీ నిధుల దుర్వినియోగం అభియోగంపై భీమ డోలు గ్రామ కార్యదర్శి తనూజకు జిల్లా పంచాయతీ అధికారులు షోకాజ్‌ నోటీసులు అందజేశారు. పంచా యతీలో సుమారు కోటి రూపాయలకు పైగా నిధు లు దుర్వినియోగం అయ్యాయని గ్రామానికి చెంది న చంద్రమౌళి అనే వ్యక్తి గతంలో ఉన్నతాధికారు లకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లాస్థాయి అధికా రులు గ్రామంలో విచారణ నిర్వహించారు. గ్రామ కార్యదర్శి వివరణ ఇవ్వాలంటూ అధికారులు షోకాజ్‌ నోటీసులు అందజేశారు.

Updated Date - Nov 23 , 2025 | 12:35 AM