Share News

గాడిన పడాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:43 AM

పాలనా పరంగా ఇంకా గాడిన పడాలి. జవాబుదారీతనం పెరగాలి. జనాభా ప్రాతిపదికన సిబ్బందిని సర్దుబాటు చేసినప్పటికి పలుచోట్ల సేవల పరంగా నిర్లక్ష్యం కనిపిస్తోంది.

గాడిన పడాలి
వేగవరం సచివాలయంలో ఇలా..

హాజరు మాయాజాలం!

పలుచోట్ల కొందరు సిబ్బంది గైర్హాజరు

ఉద్యోగులు లేక వెనుదిరుగుతున్న ప్రజలు

ఆంధ్రజ్యోతి విజిట్‌లో వెలుగులోకి..

గ్రామ, వార్డు సచివాలయాల్లో

పాలనా పరంగా ఇంకా గాడిన పడాలి. జవాబుదారీతనం పెరగాలి. జనాభా ప్రాతిపదికన సిబ్బందిని సర్దుబాటు చేసినప్పటికి పలుచోట్ల సేవల పరంగా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొన్నిచోట్ల తగిన సిబ్బంది లేకపోవడం.. కొందరు హాజరు వేసి.. కార్యాలయాల నుంచి వెళ్లిపోవడం వంటి విషయాలు సోమవారం జిల్లావ్యాప్తంగా ఆంధ్రజ్యోతి విజిట్‌లో బయటపడ్డాయి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్కు)

గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ పరంగా 594 సర్వీసులను అందించాలి. కాని, కేవలం 20 వరకు సేవలు అందుతున్నాయి. ఏలూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 495, పట్టణాలు, కార్పొరేషన్‌ పరిధిలో 110 కలిపి మొత్తం 605 సచివాలయాలు వున్నాయి. కూట మి ప్రభుత్వం జాబ్‌చార్టు అమలు చేయడంతో కొంత వరకు సర్దుబాటు జరుగుతోంది. పట్టణాల్లో రీ గ్రూపింగ్‌ జరగ్గా, గ్రామాల్లో సిబ్బందిని చాలా చోట్ల సర్దుబాటు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం రూరల్‌ మండలం వేగవరం సచి వాలయం–2లో మొత్తం తొమ్మిది మంది సిబ్బందికి సోమవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముగ్గురు హాజరయ్యారు. అదే సమయంలో సచివాలయానికి వస్తే మరో సచివాలయానికి వెళ్లండని చెబుతున్నారు. లేదంటే రేపు రమ్మని అనడంతో తిరిగి వెళ్లక తప్పలేదు. సచివాలయం–1కి వెళ్లగా వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వీఆర్వో, పశుసంవర్ధక సహాయకులు మాత్రమే సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయం దాటే వరకు సచివాలయం కుర్చీల్లో ఉన్నారు. మిగిలిన కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. దీనిపై అక్కడున్న సిబ్బందిని అడగ్గా సచివాలయం–1 సెక్రటరీ సెలవులో ఉండటం వలన ఇక్కడ సెక్రటరీ అక్కడ విధులు నిర్వహిస్తున్నారని, మిగిలిన వారిలో ఇద్దరు సెలవు పెట్టారని జవాబు చెప్పారు.

హాజరు అంతంతే..

సచివాలయ వ్యవస్థ ద్వారా సత్వరం సమ స్యలు పరిష్కారమవుతాయని ఇంటి పనులు పక్కన పెట్టి కార్యాలయాలకు వచ్చే వారికి సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. సమయ పాలన పాటించకపోవడంతో కార్యాలయాల వద్ద ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. మధ్యాహ్నం దాటితే సిబ్బంది పలుచోట్ల ఉండ టం లేదు. ద్వారకా తిరుమల–2 (కొమ్ముగూడెం)లో మహిళా పోలీ స్‌కు ఇటీవల డీఎస్‌సీ ఉద్యోగం రావడంతో రిజైన్‌ చేయగా ఆ రెండుచోట్ల ద్వారకా తిరుమల మహిళా పోలీస్‌ కమలకుమారి నే విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు చోట్ల అగ్రికల్చర్‌ అసిస్టెం టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కామవరపుకోట సచివాల యంలో 32 మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ సోమవారం ఉదయం 10 గంటలకు 18 మంది, మధ్యాహ్నం 12 గంటలకు 28 మంది ఉద్యో గులు హాజరుకాగా మిగిలిన వారు డిప్యుటేషన్ల పేరుతో వేరే సచివాలయాలకు వెళ్ళారు. జీలుగు మిల్లి సచివాలయంలో తొమ్మిది మందికి ఆరుగురు మాత్రమే ఉన్నారు. సచివా లయ ఏఎన్‌ఎం, సర్వేయర్‌, వీఆర్వో బదిలీ కావడంతో వారి స్థానంలో కొత్త వారిని నియమించ లేదు. దీంతో అదనంగా ఇంటింటి సర్వే శాఖా పరంగా సిబ్బంది ఆన్‌లైన్‌ విధులు నిర్వహిం చాల్సి వస్తోంది. ఏలూరు రూరల్‌ తంగెళ్లమూడి సచివాలయం–2లో నలుగురు ఉద్యోగులున్నారు. వారి లో ముగ్గురు మాత్రమే సచివాలయంలో ఉండగా ఒకరు అవుట్‌ డోర్‌లో ఉన్నారు. పని భారం తగ్గించా లని, ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేయాలని సిబ్బంది కోరుతున్నారు. వృద్ధులకు, వికలాంగుల పింఛన్ల పంపిణీ నుంచి పన్నుల వసూ ళ్లు, ప్రభుత్వం తీసు కొచ్చే యాప్‌ల ద్వారా పని చేయాల్సి వస్తోంది. ఈ సచివాలయ పరిధిలో 7 వేల మంది ఉండగా వీరి బాధ్యత తామే చూడాల్సి వస్తోందని సిబ్బంది వాపోతు న్నారు. జంగారెడ్డిగూడెంలో మహిళా పోలీసులకు సర్వేలు తప్ప సాధారణ విధులు పెద్దగా లేవు.

Updated Date - Nov 13 , 2025 | 12:43 AM