Share News

పరిశుభ్ర భారత్‌ కావాలి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:46 AM

భారతదేశం అన్ని రంగాల్లోను ప్రపంచదేశాలతో పోటీ పడుతోంది. దీనితోపాటు ఆరోగ్య వంతమైన... పరిశుభ్ర భారత్‌ కావాలి.

పరిశుభ్ర భారత్‌ కావాలి
కేంద్ర మంత్రి వర్మ, ఎమ్మెల్యే అంజిబాబుల చేతుల మీదుగా స్వచ్ఛాంధ్ర అవార్డును స్వీకరిస్తున్న భీమవరం మునిసిపల్‌ కమిషనర్‌ రామచంద్రారెడ్డి, ఇన్‌చార్జ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ సోమశేఖర్‌, చిత్రంలో ఎంపీ పాకా, కలెక్టర్‌ నాగరాణి తదితరులు

గోదావరి జిల్లాల్లో విస్తరిస్తున్న క్యాన్సర్‌ : ఎంపీ పాకా

భీమవరం టౌన్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి):భారతదేశం అన్ని రంగాల్లోను ప్రపంచదేశాలతో పోటీ పడుతోంది. దీనితోపాటు ఆరోగ్య వంతమైన... పరిశుభ్ర భారత్‌ కావాలి. అందరూ మెచ్చే విధంగా పరి శుభ్రతలో దేశం తలమానికంగా నిలిపేందుకు ప్రజలు సహకరించా లి’ అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీని వాస్‌వర్మ పిలుపునిచ్చారు. భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ ప్రదానోత్సవం జరిగింది. రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ‘ఉభయ గోదావరిజిల్లాల్లో క్యాన్సర్‌ మహమ్మారి విస్తరిస్తోంది. వీటి నివారణకు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. పారిశుధ్య కార్మికుల సేవలకు మనమంతా రుణపడి ఉండాలి. ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలి’ అని అన్నారు. ‘స్వచ్ఛత అంటే ఒక్క రోజు పని కాదు. ప్రతి రోజు మనం కలిసి అనుసరించా ల్సిన అలవాటు. దీని ద్వారా ఆరోగ్యవంతమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్‌ ను రూపొందించగలం’ అని కలెక్టర్‌ నాగరాణి పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరు మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని అప్పుడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవిస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు. ప్లాస్టిక్‌ నిషేధాన్ని ప్రతి ఒకరు సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. భీమవరం మున్సిపాలిటీ స్వచ్ఛ మున్సిపాలిటీగా అవార్డు వచ్చినందు కు మున్సిపల్‌ కమిషనర్‌ను అభినందించారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు

తాడేపల్లిగూడెంకు చెందిన వీర్నాల గౌరి కళా బృందం పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్‌ నిషేధం, మొక్కల పెంపకంపై ఇచ్చిన ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నది. భీమవరం జి.ఎల్‌.బి మున్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు పరిసరాల పరిశుభ్రతపై ఇచ్చిన సందేశాత్మక ప్రదర్శన ప్రశంసలు అందుకుంది. భీమవరం మునిసి పాలిటీతో లయన్స్‌ క్లబ్‌ సంయుక్తంగా స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహ ణకు అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏఎంసీ ఛైర్మన్‌ కలిదిండి సుజాత, కృష్ణబలిజ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గంటా త్రిమూర్తులు, జేసీ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి, ఏఎస్పీ వి.భీమారావు, మునిసిపల్‌ కమిషనర్‌, కె.రామచంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:46 AM