Share News

శరవేగంగా.. పటిష్టంగా!

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:53 PM

షేర్‌ వాల్‌ టెక్నాలజీని వినియోగించి అతి తక్కువ ఖర్చుతో కైకలూరులో పేదల ఇళ్లను నిర్మించేలా శ్రీకారం చుట్టింది. ఈ పద్ధతిలో ఇప్పటికే ఇరవై ఇళ్లను పూర్తిచేశారు.

శరవేగంగా.. పటిష్టంగా!
షేర్‌వాల్‌ టెక్నాలజీతో నిర్మించిన ఇల్లు

షేర్‌వాల్‌ టెక్నాలజీతో పేదల ఇళ్లు

తొలిసారి కైకలూరులో నిర్మాణాలు

కైకలూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి):షేర్‌ వాల్‌ టెక్నాలజీని వినియోగించి అతి తక్కువ ఖర్చుతో కైకలూరులో పేదల ఇళ్లను నిర్మించేలా శ్రీకారం చుట్టింది. ఈ పద్ధతిలో ఇప్పటికే ఇరవై ఇళ్లను పూర్తిచేశారు. వైసీపీ పాలనలో ఇష్టాను సారంగా ఇళ్ల నిర్మాణం చేపట్టి పునాది లెవెల్‌లో అనేక ఇళ్లు వదిలివేశారు. దీంతో లబ్ధిదారులు సొంతింటి కల నెరవేరక దిక్కుతోచక స్థితిలోకి వెళ్లారు. పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోవడం, పైగా ఒక బెడ్‌ రూంకే పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వం షేర్‌వాల్‌ టెక్నాలజీతో రెండు బెడ్‌ రూంలు, హాలు, కిచెన్‌, మెట్లు, బాత్రూమ్‌ నిర్మాణాలు చేపట్టారు. ఈ షేర్‌వాల్‌ టెక్నాలజీ వల్ల ఇంటి నిర్మాణం వేగంగా పూర్తి కావడం లబ్ధిదారుడికి ఇంటి ముందు ఎల్‌ ఆకా రంలో ఖాళీ స్థలం ఉండడంతోపాటు గాలి, వెలుతురు వస్తోంది.

ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ కైకలూ రులో ఇళ్ల నిర్మాణాల్లో లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధర లో ఇంటి నిర్మాణం చేయాలని ఆలోచన చేశా రు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేసిన కాంట్రాక్టర్‌ సహకరించకపోవడంతో కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కైకలూరులో మొదటి సారిగా ఈ షేర్‌వాల్‌ టెక్నాలజీతో 1450 ఇళ్లు నిర్మిం చాలని సంకల్పించారు. ఇప్పటికే నిర్మించి న ఇరవై ఇళ్లలో లబ్ధిదారులు నివసిస్తున్నారు. పునాది నుంచి శ్లాబు, మెట్లు, పిట్ట గోడలు నిర్మి స్తారు. లబ్ధిదారుడు కొంత వాటా చెల్లించాలి. ప్రతీ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తుంది. లబ్ధిదారులు సహ కరిస్తే నెలకు 60 ఇళ్లు నిర్మిస్తారు. ఈ ఆధునిక టెక్నాలజీ లబ్ధిదారులకు మేలు చేస్తుందని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకో వాలని అధికారులు కోరుతున్నారు.

సెంటున్నరలో ఇలా

సెంటున్నర స్థలంలో షేర్‌ వాల్‌ టెక్నాలజీ తో నిర్మిస్తున్న ఇంటిలో రెండు బెడ్‌ రూమ్‌ లు వుంటాయి. వీటి పొడవు, వెడల్పులు ఒకటి 11/10.5, మరొకటి 11/9.5 అడుగు లు, హాలు 12/7.5 అడుగులు, కిచెన్‌ 7/7.5 అడుగులు. ఇంటి ముందు ఎల్‌ షేప్‌లో ఖాళీ ప్రదేశం, మెట్లు, బాత్రూం ఉంటాయి.

ఇళ్లు నిర్మించకుంటే..

కైకలూరు–ఏలూరు రోడ్డులో గ్రీన్‌ విలేజ్‌లో ఇళ్ల నిర్మాణాలకు ఎంపికైన లబ్ధి దారులు వచ్చే మార్చి నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోతే పట్టాలు రద్దు చేసే పరిస్థి తులు ఉన్నాయని గృహ నిర్మాణ శాఖ డీఈ వీవీఎస్‌ శేఖర్‌ తెలిపారు.

నేడు జిల్లాలో 15,204 ఇళ్లకు గృహప్రవేశ మహోత్సవం

ఏలూరుసిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో చేపడుతున్న మూడు లక్షల గృహ ప్రవేశ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు జిల్లాలో కూటమి ప్రభుత్వ హయాంలో నూతనంగా నిర్మించిన 15,204 గృహాలకు నియోజకవర్గ స్థాయిలో ఈనెల 12వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి. సత్యనారాయణ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే కార్యక్రమంలో కొత్తగా గృహా లకు మంజూరు కాబడిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా సంబంధిత గ్రామ సచివాల యాల్లో చేస్తారని ఆయన వివరించారు.

Updated Date - Nov 11 , 2025 | 11:53 PM