నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:25 AM
వసతిగృహ నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు.
తణుకు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): వసతిగృహ నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. తణుకు సాంఘిక సంక్షేమ వసతి గృహం గురువారం ఆమె పరిశీలించారు. వర్షం నీరు చేరడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం సమీప బీసీ కళా శాల బాలికల వసతి గృహానికి విద్యార్థులను తరలించారు. ఆ సమయంలో వసతిగృహ సంక్షేమాధికారి లేకపోవడంతో తహసీల్దార్ అశోక్‌వర్మ, ముని సిపల్ కమిషనర్ రామ్‌కుమార్ పరిస్థితిని చక్కదిద్దడంతో కలెక్టర్ అభినం దించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్‌డబ్ల్యువోను హెచ్చరించారు. అనంతరం తాత్కాలిక వసతి కల్పించిన బీసీ కళాశాల వసతి గృహంలో విద్యార్థినులతో మాట్లాడారు. జిల్లా సాంఘిక సంక్షేమాధి కారి రామాంజనేయరాజు, వసతిగృహ అధికారి అరుణ, తహసీల్దార్ డీవీ ఎస్‌ఎస్ అశోక్‌వర్మ, మునిసిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్ పాల్గొన్నారు.
రోగులకు సేవతో కూడిన వైద్యం అందించాలి
రోగులకు సేవతో కూడిన వైద్యం అందించాలని కలెక్టర్ నాగరాణి అన్నా రు. జిల్లా కేంద్ర ఆస్పత్రిని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఆసుపత్రి అభివృద్ధి పనులు, డ్రెయిన్లు, మరుగుదొడ్లు నిర్మాణాలను పరిశీలించారు. పలు వైద్య విభాగాలు పరిశీలించి రోగులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. వార్డుల్లో రోగులకు అందుతున్న సేవలు, ఇబ్బం దులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల కొరత, సిబ్బంది పనితీరుపై సమీక్షించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కె.సాయి కిరణ్, ఆర్‌ఎంవో ఏవీఆర్‌ఎస్.తాతారావు, పలు విభాగాల వైద్యులు ఉన్నారు.