Share News

అద్వితీయం

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:32 AM

ఆలయాలకు వచ్చే భక్తులకు దేవతా మూర్తుల దర్శనంతో పాటు, మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన ప్రసాదం అందించడం అక్కడి అధికారుల కనీస బాధ్యత.

అద్వితీయం

భక్తులకు సేవల ర్యాంకింగ్‌లో ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి రెండో స్థానం

ఫీడ్‌బ్యాక్‌తో ప్రజాభిప్రాయ సేకరణ

ద్వారకాతిరుమల, డిసెంబరు 7 (ఆంధ్ర జ్యోతి): ఆలయాలకు వచ్చే భక్తులకు దేవతా మూర్తుల దర్శనంతో పాటు, మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన ప్రసాదం అందించడం అక్కడి అధికారుల కనీస బాధ్యత. దీనిపై అటు ప్రభుత్వంతో పాటు ఇటు ఆలయ ఉన్నతాధి కారులు సైతం దృష్టి సారించారు. ఈ క్రమంలో భక్తులకు ఫోన్లు చేసి ఆలయాల్లో అందే సేవల పై అభిప్రాయాలు సేకరించారు. రాష్ట్ర దేవాల యాల్లో భక్తులకు అందే సేవలపై గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది నవంబరు నెల వరకు అభిప్రాయాలు సేకరించారు.

రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల్లో ఒక టైన ద్వారకాతిరుమల క్షేత్రానికి వచ్చిన భక్తు లకు మెరుగైన సేవలందించడంలో 71.5 శాతం తో రెండో స్థానం లభించగా సంతృ ప్తకరమైన స్థాయిని దక్కించుకుంది. స్వామి వారి దర్శనం సంతృప్తికరంగా ఉందా... మౌలిక సదుపా యాలు బాగున్నాయా... ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా అన్న ప్రశ్నలతో భక్తుల నుంచి సేకరించిన ఫీడ్‌ బ్యాక్‌ ద్వారా ఈ స్థానం లభించింది. శ్రీకాళ హస్తి 72.7 శాతంతో ప్రథమ స్థానంలో నిల వగా, 70.4తో మూడో స్థానంలో శ్రీశైలం, 70 శాతంతో నాలుగో స్థానంలో కాణి పాకం, 68.8తో సింహాచలం ఐదో స్థానం, 67.8తో అన్నవరం ఆరో స్థానంలో నిలవగా చివరి స్థానంలో 66 శాతం సంతృప్తితో ఇంద్ర కీలాద్రి దుర్గమ్మ ఆలయం నిలిచింది. ఉప కమి షనర్‌ హోదా కల్గిన రాష్ట్రంలోని 14 ముఖ్య ఆల యాల్లో మోపిదేవి ఆలయం, నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయాలు 70.2 శాతంతో మొదటి స్థానంలో ఉన్నాయి.

సర్వే జరిగిందిలా..

రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తులకు మెరు గైన సేవలందించాలని ప్రభుత్వం ఎప్పటి కప్పు డు సూచిస్తూనే ఉంది. అయితే కొందరు అధికా రులు ఆ ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆశించిన స్థాయిలో భక్తులకు సేవలు అందడం లేదనే వాదన వినిపిస్తోంది. భక్తులకు గత ఏడాదిన్నర కాలంగా అక్కడ అందే సేవల పై ప్రభుత్వం ఆరా తీసింది. ఈ క్రమంలో రాష్ట్రం లోని జాయింట్‌ కమిషనర్‌ హోదా కల్గిన ప్రధాన 7 ఆలయాలను ఒక విభాగంలోను, డిప్యూటీ కమిషనర్‌ హోదా కల్గిన 14 ముఖ్య ఆలయా లను మరో విభాగంలోను చేర్చారు. భక్తులకు ఫోన్లు చేసి వారు దర్శించిన ఆలయం.. అక్కడ సౌకర్య, అసౌకర్యాలపై అభిప్రాయ సేకరణ జరి పారు. దైవ దర్శనంలో ఇబ్బందు లెదుర్కొ న్నారా... తాగునీరు, వసతులు, పారిశుధ్యం సంతృప్తినిచ్చాయా... అన్న అంశాలపై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని పర్సంటేజ్‌లు కేటాయించారు.

మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం...

గతంలో భక్తులు అంతరాలయ దర్శనం లేద ని అసంతృప్తిగా ఉండేవారు. కరోనా సమ యంలో నిలుపుదల చేసిన అంతరాలయ దర్శ నాన్ని ఈవో ఎన్వీ సత్యన్నారాయణమూర్తి కృషి తో ఇటీవల పునరుద్ధరించారు. ప్రస్తుతం అమ్మ వార్ల ముందు నుంచి కూడా గతంలో వలే దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవార్లను సాధారణ భక్తులు సైతం మరింత దగ్గర నుంచి చూసే అవకాశం కలగటంతో గతం కంటే మెరు గైన ఫలితాలు వచ్చి పర్సంటేజ్‌ పెరిగి రానున్న రోజుల్లో ప్రథమ స్థానాన్ని పొందాలని ఆశిద్దాం.

మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం..

స్వయంవ్యక్తమూర్తిగా చినవెంకన్న ద్విమూర్తులుగా కొలువుదీరిన ద్వారకా తిరుమలను ఆలయ చైర్మన్‌ రాజా ఎస్వీ సుధాకరరావు సూచన లతో మరింత అభివృద్ధి చేస్తాం.. ఇప్పటికే అంతరాలయ దర్శనాన్ని పునరు ద్ధరించాం... అలాగే పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచేలా చర్యలు తీసుకుంటున్నాం.. శుద్ధమైన తాగునీటిని, రుచికరమైన ప్రసాదాలను భక్తులకు అందజేస్తున్నాం. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నాం.. భక్తులకు భవిష్యత్‌లో చక్కని దైవదర్శనంతో పాటు మెరుగైన సౌకర్యాలు మరిన్ని కల్పిస్తాం.

–ఎన్వీ సత్యన్నారాయణమూర్తి, ఆలయ ఈవో, ద్వారకాతిరుమల

Updated Date - Dec 08 , 2025 | 12:33 AM