సముద్ర కోతకు అడ్డుకట్ట
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:18 AM
మండలంలోని పీఎంలంక వద్ద సముద్ర కోత నివారణకు గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
నరసాపురం రూరల్, జూలై 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని పీఎంలంక వద్ద సముద్ర కోత నివారణకు గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ రీజనల్ మేనేజర్ రమేష్‌శెట్టి చెప్పారు. గోడ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తున్న డెలైట్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం పనులు పరిశీలించారు. కోత నివారణకు ఈ సంస్థ రూ.13.50 కోట్లు అందించడంతో సుమారు ఒక కిలో మీటరు గోడ నిర్మించనున్నారు. పూనేకు చెందిన గార్వేర్ సంస్థ చేపట్టిన నిర్మాణ పనులపై డెలైట్ సంస్థ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. రమేష్‌శెట్టి మాట్లాడుతూ సింగపూర్, మలేషియాలో సముద్ర కోత నివారణకు ఏ తరహాలో గోడ నిర్మించారో అదే టెక్నాల జీని ఇక్కడ వినియోగించామన్నారు.