సమస్యలు పరిష్కరించకుంటే చర్యలు
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:26 AM
‘ఏపీఈ పీడీసీఎల్ పరిధిలో ప్రజల నుంచి వస్తున్న సమస్య లపై వెంటనే స్పందించి పరిష్కరించకుంటే చర్యలు తప్పవు. పనిచేయని వారిని వదులుకోవడానికి సంస్థ సిద్ధంగా ఉంది’ అని జిల్లా విద్యుత్ సూపరిం టెండెంట్ ఆఫ్ ఇంజనీర్ సాల్మన్‌రాజు అధికారుల ను, సిబ్బందిని హెచ్చరించారు.

విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సాల్మన్‌రాజు
బుట్టాయగూడెం,జూలై 4(ఆంధ్రజ్యోతి): ‘ఏపీఈ పీడీసీఎల్ పరిధిలో ప్రజల నుంచి వస్తున్న సమస్య లపై వెంటనే స్పందించి పరిష్కరించకుంటే చర్యలు తప్పవు. పనిచేయని వారిని వదులుకోవడానికి సంస్థ సిద్ధంగా ఉంది’ అని జిల్లా విద్యుత్ సూపరిం టెండెంట్ ఆఫ్ ఇంజనీర్ సాల్మన్‌రాజు అధికారుల ను, సిబ్బందిని హెచ్చరించారు. బుట్టాయగూడెం శుక్రవారం వచ్చిన ఆయన సబ్ స్టేషన్ అధికారు లు, సిబ్బందితో సమీక్షించారు. ఆయన మాట్లాడు తూ ‘ఆర్‌డీఎస్ స్కీమ్ విషయంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని అన్ని గ్రామాల్లోని ప్రతి ఇంటికి 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేయడం కోసమే ఆర్‌డీఎస్ స్కీమ్‌ను తీసుకొచ్చారు. జిల్లాలో 24 చోట్ల కొత్త సబ్ స్టేషన్ల ను ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైన స్టేషన్లలో కెపాసీటిని పెంచుతున్నాం. జిల్లాలో 9 నుంచి 9.2 మిలియన్ల విద్యుత్ వాడకం జరుగుతోంది. జిల్లాలో 4.51 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా ఎస్సీ, ఎస్టీ 2.25 లక్షలు, బీసీ 2.50 లక్షల కనెక్షన్లు ఉండగా మిగిలినవి ఇతర కులాలకు చెందినవారు.జిల్లాలో 1,004 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఇవన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినవి.పీఎం సూర ఘర్ పథకంలో సోలార్ విద్యుత్ యూనిట్లను సబ్సి డీపై పంపిణీ చేస్తున్నాం. సోలార్ యూనిట్లను జిల్లాలో 2,600 పంపిణీ చేసి రాష్ట్రంలోనే జిల్లా ప్రఽథమ స్థానంలో ఉంది. జిల్లాలో 35 విద్యుత్ సరఫరా సెక్షన్లు ఉన్నా యి. బుట్టాయగూడెం, లింగపాలెం, కుక్కునూరు, నిడమర్రు సెక్షన్లలో నిరతంర విద్యుత్ సరఫరా, లో ఓల్టేజి, సిబ్బంది పనితీరుపై ప్రజాభిప్రాయం సేక రించగా పైనాలుగు సెక్షన్లు వెనుకబడి ఉన్నాయి. సీఎండీ ఆదే శాల మేరకు అన్ని సెక్షన్లలో సమీక్షలు జరిపి చర్యలు తీసుకుంటున్నాం. బుట్టాయగూడెం సబ్ స్టేషన్‌లో సిబ్బంది కొరత లేకున్నా ప్రజల నుంచి ఫిర్యాదులు ఎందుకు అందుతున్నాయి. పనితీరును మెరుగు పర్చుకోవాలి’ అంటూ సూచించారు. తొలుత కార్యాలయ ఆవరణలో సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జంగారెడ్డిగూ డెం డీఈ పీర్ అహ్మద్ ఖాన్, డీఈ టెక్నికల్ ఏలూరు రాధా కృష్ణ, ఏఈ శ్రీనివాసవర్మ పాల్గొన్నారు.