Share News

టీచర్‌ లేని పాఠశాల!

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:15 AM

ఆ పాఠశాలకు ఉపాధ్యాయుడు లేరు. 25 మంది విద్యార్థులు ఉన్నారు. రోజూ పిల్లలు వస్తారు.. కాసేపు అడుకుని వెళ్లిపోతారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు మాత్రం భోజనం వండి పెడుతున్నారు.

టీచర్‌ లేని పాఠశాల!
పాఠశాల వరండాలో కూర్చున్న విద్యార్థులు

ఇటీవల 50 మంది టీచర్ల బదిలీ

మండలంలో 85 పోస్టులు ఖాళీ

ఆ పాఠశాలకు ఉపాధ్యాయుడు లేరు. 25 మంది విద్యార్థులు ఉన్నారు. రోజూ పిల్లలు వస్తారు.. కాసేపు అడుకుని వెళ్లిపోతారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు మాత్రం భోజనం వండి పెడుతున్నారు. కానీ పర్యవేక్షణ లేదు. కుక్కునూరు మండలం దామరచర్ల ప్రాథమికోన్నత పాఠశాల తీరు ఇది. పిల్లలకు పాఠశాలు చెప్పేవారు లేరు సరే.. కనీసం పట్టించుకునే వారు లేకపోవడంతో ఎందుకు పంపించాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

కుక్కునూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): పిల్లలను బడిలో చేర్చాలంటూ అధికారులు, ఉపాధ్యాయులు ప్రచారం చేస్తున్నారు. కుక్కునూరు మండలంలో ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పే మాస్టార్లు లేరు. ఇటీవల మండలం నుంచి 50మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీపై వెళ్లిపోయారు. 85 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దామరచర్ల పాఠశాలలో 7వ తరగతి వరకు తరగతులు ఉన్నాయి. ప్రతీరోజు స్కూల్‌కు 25 మంది విద్యార్థులు వస్తున్నారు. ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం మాత్రం వండి పెడుతున్నారు. సమీపంలో గోదావరి ఉండడంతో వరద ముంచుకొచ్చిన సమయంలో పిల్లలు అడువైపు వెళతారని విద్యార్థుల తల్లిదండ్రులు హడలిపోతున్నారు. పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడిని పంపి తరగతులు నిర్వహించకుండా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

Updated Date - Jul 16 , 2025 | 01:15 AM