Share News

ఫీజు పేరిట వసూళ్ల దందా!

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:35 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు పేరుతో ప్రభుత్వ హైస్కూల్లో వసూళ్ల దందా ప్రారంభమైంది. కార్పొరేట్‌ పాఠ శాలల తరహాలో ఏకంగా లిస్టులు తయారు చేసి విద్యార్థులకు ఇచ్చి సొమ్ము కట్టాలంటూ మండలం లోని రెండు హైస్కూళ్ల హెచ్‌ఎంలు ఆదేశిం చడం గమనార్హం.

ఫీజు పేరిట వసూళ్ల దందా!
గుండుగొలనులో గార్డెన్‌ పనులు చేస్తున్న విద్యార్థులు

పదో తరగతి విద్యార్థులకు లిస్టుల అందజేత

నిబంధనలను బేఖాతర్‌ చేస్తున్న కొందరు హెచ్‌ఎంలు

భీమడోలు, నవంబరు 28(ఆంధ్ర జ్యోతి):పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు పేరుతో ప్రభుత్వ హైస్కూల్లో వసూళ్ల దందా ప్రారంభమైంది. కార్పొరేట్‌ పాఠ శాలల తరహాలో ఏకంగా లిస్టులు తయారు చేసి విద్యార్థులకు ఇచ్చి సొమ్ము కట్టాలంటూ మండలం లోని రెండు హైస్కూళ్ల హెచ్‌ఎంలు ఆదేశిం చడం గమనార్హం.

ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాల మేరకు పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 నిర్ణ యించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినా కొందరు హెచ్‌ఎంలు ఆ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ సొమ్ము వసూళ్లు ప్రారంభిం చారు. గ్రూపు ఫొటోలకు, స్పెషల్‌ ఫీజు లు, గేమ్స్‌ ఫీజులు, ఇన్సూరెన్సు, ప్రొసెసింగ్‌ ఫీజుల పేరిట విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు. కళాశాల స్థాయిలో వసూలు చేసే మిస్సెలియన్స్‌ ఫీజును హైస్కూళ్లలో వసూలు చేసేందుకు విద్యార్థులపై ఒత్తి డి చేస్తున్నారు. మండలంలో మొత్తం ఐదు హైస్కూళ్లు ఉన్నాయి. వీటిలో గుండుగొలను జిల్లా పరిషత్‌ హైస్కూ ల్‌లో ఈ తతంగం తారస్థాయికి చేరిం ది. ఏకంగా ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.350 ఫీజుల పేరిట వసూలు చేసేం దుకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. భీమడోలు హైస్కూల్‌లో రూ.175 వసూలు చేస్తు న్నారు. మిగిలిన హైస్కూళ్లలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఫీజు చెల్లించమం టున్నారు. గుండుగొలను హెచ్‌ఎం సునీ తను వివరణ కోరగా ‘వసూళ్లపై జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులకు నేను వివరణ ఇస్తాను’ అంటూ తెలిపారు. మరోవైపు గుండుగొలను హైస్కూల్‌లో పాఠశాల తరగతులు జరిగే సమయం లో విద్యార్థులతో గార్డెన్‌ పనులు చేయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

Updated Date - Nov 29 , 2025 | 12:35 AM