Share News

వైసీపీ త్రిసభ్య కమిటీల ధన దాహానికి.. సొసైటీలు స్వాహా

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:39 AM

వైసీపీ హయాంలో సహకార సంఘాల్లో ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీల్లోని కొందరు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు స్వాహా చేశారు.

వైసీపీ త్రిసభ్య కమిటీల ధన దాహానికి.. సొసైటీలు స్వాహా

బినామీల పేరిట రుణాలు

ఫోర్జరీ సంతకాలతో ధాన్యం కమీషన్‌ సొమ్ములు,

నిధులు మింగేశారు

పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు..

అధికారుల విచారణలతో అవినీతి బట్టబయలు

వైసీపీ హయాంలో సహకార సంఘాల్లో ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీల్లోని కొందరు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు స్వాహా చేశారు. అధికారుల తాజా విచారణల్లో ఒక్కో సొసైటీల్లో జరిగిన అవినీతి బట్టబయలు అవు తోంది. బినామీ పేర్లతో రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం చెల్లించే ధాన్యం కమీషన్‌లు మింగేశారు. ఫోర్జరీ సంతకాలతో సొసైటీ నిధులు పక్కదారి పట్టించారు. ఇలా సొసైటీలను స్వాహా చేసి.. వాటి మనుగడను బలి తీసుకున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పెంటపాడు మండలం కోరుమిల్లి సొసైటీలో వైసీ పీ హయాంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ రూ.1.70 కోట్లు పక్కదారి పట్టించింది. జిల్లా సహకార బ్యాం కు నుంచి నిధులు తెచ్చి బినామీ పేర్లతో రుణాలు ఇచ్చినా వాటిని రికవరీ చేయలేదు. కమిటీ సభ్యులు, అప్పటి సిబ్బంది కుమ్మక్కై నిధులు మింగేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశించడం తో అవినీతి జరిగినట్టు అధికారులు నిగ్గు తేల్చారు. వడ్డీతో సహా స్వాహా అయిన నిధులు రూ.2.23 కోట్ల కు చేరినట్టు లెక్కలు కట్టారు. వైసీపీ హయాంలో అవినీతి దందాకు కోరుమిల్లి సొసైటీ బలైంది. జిల్లా సహకార బ్యాంకు నుంచి తెచ్చిన సొమ్ములకు వడ్డీ లు చెల్లిస్తూ వస్తోంది. మరోవైపు అప్పట్లో ప్రభు త్వం సొసైటీకి విడుదల చేసిన ధాన్యం కమీషన్‌ సొమ్మును ఖర్చులు చూపించి బొక్కేశారు. వాస్తవానికి రైతులకు రవాణా, తూకం ఛార్జీల రూపం లో చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులకు ఇవ్వ కుండా, సొసైటీకి వినియోగించ కుండా వైసీపీ నేత ధాన్యం కమీ షన్‌ సొమ్మును మింగేశారు. లెక్క తేలిన దందాపై రికవరీ చేస్తామం టూ అఽధికారులు చెబుతున్నారు.

ఒక్కో సొసైటీది ఒక్కో కథ

దర్శిపర్రు సొసైటీలో రూ.22 లక్షలు అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అక్కడ 51 విచారణ కొనసాగుతోంది. రుణాల గల్లంతు, కమీ షన్ల స్వాహా ఆరోపణలు వెలుగుచూశాయి. సిద్ధాం తం సొసైటీలో రూ.1.50 కో ట్లు గల్లంతైంది. దీనిపై వి చారణ చేపట్టి అవినీతి జరి గినట్టు నిర్ధారించారు. ఇర గవరం మండలం కొత్త పాడు సొసైటీలో రూ.51 లక్షలు తేడా కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సొసైటీ ఖాతాలపై ఆరా తీశారు. దీంతో అక్కడ ఒక సిబ్బంది ఆత్మహత్య చేసు కున్న ఘటన చోటు చేసు కుంది. ఇప్పటికీ అక్కడ వి చారణ కొనసాగుతోంది.నార్ని మెరక సహకార సంఘంలో రూ. 11 లక్షలు, మేడపాడు సహకార సం ఘంలో రూ.7 లక్షలు దుర్వినియోగం అయినట్టు గుర్తించారు. దీనిపై జిల్లా సహకార అధికారి విచార ణకు ఆదేశించడంతో దర్యాప్తు చేపడుతున్నారు.

కూటమి పార్టీల్లోకి వెళ్లేందుకు..

తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం అరుగొలను లో రూ.10.50 లక్షలు గోల్‌మాల్‌ జరిగినట్లు ఫిర్యా దులు రావడంతో 52 విచారణకు ఆదేశించారు. అధి కారులు రికార్డులు పరిశీలించారు. వైసీపీ హయాం లో ధాన్యం కమీషన్‌ సొమ్ములు సొసైటీల్లో దుర్విని యోగమయ్యాయి. అప్పటి నేతలు జేబుల్లోకి నిధు లు మళ్లాయి. ఆ దందాలు వెలుగులోకి వస్తాయన్న ఉద్దేశంతో కొందరు వైసీపీ నాయకులు కూటమిలో పార్టీల్లోకి చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

రికవరీలు కష్టమే..!

సొసైటీల్లో పక్కదారిపట్టిన సొమ్ములను రికవరీ చేసిన సందర్భాలు తక్కువే. రికవరీ చేస్తామంటూ అధికారులు చెబుతున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. నిధుల దుర్వి నియోగం సమయంలో పనిచేసిన సిబ్బందికి నోటీసులు జారీ చేయలేదు. దీంతో ఎంత మేర రికవరీ అవుతుందోనన్నది సందేహమే..!

నష్టాల్లో సహకార సంఘాలు

వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు త్రిసభ్య కమిటీలే రాజ్యమేలాయి. వారి హ యాంలో నిధులు దుర్వినియోగానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. జిల్లాలోని అత్యధిక సొసైటీలు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి. కూట మి ప్రభుత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీలు ఇప్పుడు తలలు పట్టుకుం టున్నాయి. సొసైటీలు ఎంత మేర నష్టాల్లో ఉన్నాయనే దానిపై ప్రస్తుత కమిటీలు లెక్కలు కట్టే పనిలో నిమగ్నమయ్యాయి. అవినీతి దందాలపై వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా అధికారులు విచారణకు ఆదేశిస్తున్నారు.

Updated Date - Dec 04 , 2025 | 12:39 AM