పరిహారం.. ఊరట
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:25 AM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట నష్టపరిహారాన్ని పెంచారు.
వరికి హెక్టారుకు రూ.5వేల నుంచి రూ. 8వేలు.. ఉద్యాన పంటలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు పెంపు
ఏలూరుసిటీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట నష్టపరిహారాన్ని పెంచారు. మొంథా తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వం కంటే పెంచి నష్ట పరిహారాన్ని చెల్లిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేర కు గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు అదనంగా రూ.5 వేలు నుంచి రూ.8 వేలు, ఉద్యాన పంటలకు అదనంగా రూ.8 వేలు నుంచి రూ.12,500 వరకు పెంచారు. దీంతో వరి పంటకు హెక్టారుకు రూ.25 వేలు, ఉద్యాన పంటలకు రూ. 22,500 నుంచి రూ.35 వేలు వరకు పెరిగింది.
మొంథా తుఫాన్ కారణంగా ఇటీవల జిల్లాలో వరి తోపాటు ఇతర పంటలు 5704.24 హెక్టార్లలో, ఉద్యాన పంటలు 17.60 హెక్టార్లలో నష్టపోయారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ బృందం పంట నష్టాలను అంచనా వేయడానికి జిల్లాలో పర్యటించింది. ప్రస్తుతం సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఈ దశలో పెంచిన నష్టపరిహారం రైతులకు అందిస్తే వారికి ప్రయోజనం చేకూరుతుంది.
ఉద్యాన పంటలలో ఆయిల్ పామ్, కొబ్బరి మొక్కలకు మొక్కకు గతంలో రూ.1000 ఇవ్వగా ఇప్పుడు పెంచిన నష్టపరిహారం ఆధా రంగా రూ.1500 మొక్కకు నష్టపరిహారం చెల్లిస్తారు. హెక్టారుకు 150 మొక్కలకు మాత్రమే ఈ నష్టపరిహారం అందుతుంది. కొల్లేరు నష్టాలను పరిశీలించిన సమయంలో గత జనవరిలో ఈ పంట నష్టపరిహారాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.
వ్యవసాయ పంటలకు..
పంట రకం గతంలో నష్ట పరిహారం (హెక్టారుకు రూ.) పెంచిన పరిహారం (హెక్టారుకు రూ.)
పత్తి 17,000 25,000
వేరుశనగ 17,000 25,000
వరి 17,000 25,000
చెరకు 17,000 25,000
మినుము 10,000 15,000
పెసలు 10,000 15,000
మొక్కజొన్న10,000 15,000
కందులు 10,000 15,000
నువ్వులు 8,500 15,000
పొగాకు 10,000 15,000
సోయాబీన్ 10,000 15,000
ఉద్యాన పంటలకు..
పంట రకం గతంలో నష్ట పరిహారం (హెక్టారుకు రూ.)పెంచిన పరిహారం (హెక్టారుకు రూ.)
అరటి 25,000 35,000
పసుపు 17,000 35,000
కూరగాయలు 17,000 25,000
మిరప 17,000 35,000
బొప్పాయి 17,000 25,000
టమోటో 17,000 25,000
జామ 22,500 35,000
పూలు 17,000 25,000
ఉల్లి 17,000 25,000
నిమ్మ 22,500 35,000
మామిడి 22,500 35,000
కాఫీ 22,500 35,000
నర్సరీ 17,000 25,000
జీడిమామిడి 22,500 35,000