కైకలూరు తాత్కాలిక సర్పంచ్‌గా నాయుడు
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:43 AM
కైకలూరు తాత్కాలిక సర్పంచ్‌గా 15వ వార్డు సభ్యుడు కొటికలపూడి వెంకట నరసింహమూర్తి నాయుడును ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.
కైకలూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి):కైకలూరు తాత్కాలిక సర్పంచ్‌గా 15వ వార్డు సభ్యుడు కొటికలపూడి వెంకట నరసింహమూర్తి నాయుడును ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి పి.ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిం చారు. గత సర్పంచ్ డీఎం నవరత్నకుమారి ఎస్సీ రిజర్వేషన్‌తో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆమెను ఆరు నెలలపాటు తొలగిస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. 20 మంది వార్డు సభ్యులకు ఇద్దరు మృతి చెందారు. ఒకరు గైర్హాజరు కాగా 17 మంది హాజరయ్యారు. సభ్యులంతా సర్పంచ్‌గా నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కార్యదర్శి ప్రసాద్ ప్రకటించారు. ఆయనను మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, ఎంపీ పీ అడవి కృష్ణ, వార్డు సభ్యులు పూలమాలలతో సత్కరించారు.