Share News

పెయ్యేరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:45 AM

పెయ్యేరు గ్రామ సర్పంచ్‌ ఎ.సుశీల చెక్‌ పవర్‌ను రద్దు చేస్తూ డీపీవో కె.అనూరాధ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పెయ్యేరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు

ముదినేపల్లి, జూలై 30(ఆంధ్రజ్యోతి):పెయ్యేరు గ్రామ సర్పంచ్‌ ఎ.సుశీల చెక్‌ పవర్‌ను రద్దు చేస్తూ డీపీవో కె.అనూరాధ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధుల వినియోగంలో అవకతవకలపై గ్రామానికి చెందిన కొందరు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎల్‌పీవో నిర్వహించిన విచారణ నివేదికల ఆధారంగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ను ఆరు నెలలపాటు రద్దు చేశారని ముదినేపల్లి డిప్యూటీ ఎంపీడీవో అశోక్‌ తెలిపారు. చెక్‌ పవర్‌ను ఎంపీడీవోకు అప్పగించారు. నిధుల దుర్వి నియోగంపై పునర్విచారణ జరిపించాలని గ్రామానికి చెందిన రెడ్డి వెంకటేశ్వ రరావు, అల్లా భక్షు, దూబా చంద్రకాంత్‌ చేసిన ఫిర్యాదులపై విచారణ పెండింగ్‌లోనే ఉంది.

Updated Date - Jul 31 , 2025 | 12:45 AM