Share News

ఏలూరులో స్టేడియాల రూపురేఖల్ని మార్చండి

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:55 AM

జిల్లా కేంద్రమైన ఏలూరు స్టేడియాల్లోని రూపురేఖల్ని మూడు నెలల్లో మా ర్చి.. సుందరంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోండి.. వాకర్స్‌కు ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి’ అని శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు క్రీడాధికారులను ఆదేశిం చారు.

ఏలూరులో స్టేడియాల రూపురేఖల్ని మార్చండి
ఇండోర్‌ స్టేడియంలో పైకప్పు పరిశీలిస్తున్న రవి నాయుడు

శాప్‌ చైర్మన్‌ రవినాయుడు ఆదేశం

ఏలూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘జిల్లా కేంద్రమైన ఏలూరు స్టేడియాల్లోని రూపురేఖల్ని మూడు నెలల్లో మా ర్చి.. సుందరంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోండి.. వాకర్స్‌కు ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి’ అని శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు క్రీడాధికారులను ఆదేశిం చారు. రవినాయుడు పెద్ద రైల్వేస్టేషన్‌ వద్ద అల్లూరి సీతా రామరాజు స్టేడియాన్ని తొలుత పరిశీలించి.. అక్కడ వాకర్స్‌, క్రీడాకారులతో సౌకర్యాలపై ఆరా తీశారు. సీఎం చంద్ర బాబు నాయడు ఆధ్వర్యంలో క్రీడా వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. స్టేడియంలో టెన్నిస్‌, ఫుట్‌ బాల్‌, హాకీ, అథ్లెటిక్స్‌, స్విమ్మింగ్‌పూల్‌, బాస్కెట్‌బాల్‌ ఆడే క్రీడాకారులకు సౌకర్యాలను కల్పించాలని, వారు ప్రాక్టీస్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా వాకర్స్‌కు ఏర్పాట్లు ఉం డాలని సూచించారు. అథ్లెటిక్స్‌కు అనుగుణంగా సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. ఇండోర్‌ స్టేడి యంలో ఆయన పరిశీలించి.. పరిశుభ్రతకు పెద్దపీట వేయా లని, మైదానం పూర్తిగా చదును చేయాలని ఆదేశించారు. ఇక్కడ ఇటీవల కూల్చివేసిన స్థానంలో మల్టీపర్పస్‌ స్టేడి యం అభివృద్ధికి అంచనాలు వేయాలని ఇంజనీర్లకు ఆయన సూచించగా, వారు కొలతలు తీసుకున్నారు. స్విమ్మింగ్‌ పూల్‌లో లైటింగ్‌, టాయిలెట్లు మరమత్తులు, జిమ్‌ రూమ్‌ లో విద్యుత్‌ సౌకర్యాలను మెరుగుపర్చడం కోసం శాప్‌ ఇం జనీర్లు అనిల్‌, ప్రశాంత్‌లు అంచనాలు వేశారు. రాష్ట్ర వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ సెక్రటరీ బడేటి వెంక ట్రామయ్య మాట్లాడుతూ స్టేడియాల్లో మౌలిక సదు పాయాల కల్పనకు చర్యలకు ఎమ్మెల్యే చంటి సహ కారంతో అన్ని చర్యలు చేపడతామన్నారు. శాప్‌ చైర్మన్‌ వెంట డైరెక్టర్లు జగదీశ్వరీ, ఎస్‌.సంతోష్‌కుమార్‌, పేరం రవీంధ్ర నాథ్‌, డీఎస్‌డీవో ఎస్‌ఏ అజీజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 12:55 AM