ఇసుక కష్టాలకు చెక్!
ABN , Publish Date - May 22 , 2025 | 12:23 AM
వర్షాకాలం అవసరాలకు ఇసుక నిల్వలను ఉంచుతూ ప్రతి నియోజకవర్గ పరిధిలో ఇసుక స్టాక్ పాయింట్లు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చేపట్టిన కసరత్తులు కొలిక్కి వచ్చాయి.
జిల్లాలో ఐదు స్టాక్ పాయింట్లు
ఐదు నియోజకవర్గాలు.. ఐదు లక్షల మెట్రిక్ టన్నులు
నెలాఖరులోగా తాడిపూడి నుంచి నిల్వలు తరలింపు
ఐదు నెలల అవసరాలకు సరిపోతాయని అంచనా
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
వర్షాకాలం అవసరాలకు ఇసుక నిల్వలను ఉంచుతూ ప్రతి నియోజకవర్గ పరిధిలో ఇసుక స్టాక్ పాయింట్లు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చేపట్టిన కసరత్తులు కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు ఐదు స్టాక్ పాయింట్లలో ఈ నెలాఖరు నాటికి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తరలించి నిల్వ ఉంచనున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని తాడిపూడి ఇసుక రీచ్ నుంచి మన జిల్లాకు కేటాయింపుల్లో భాగంగా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను రవాణా చేయడానికి టెండర్లను ఇటీవల ఖరారు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. జీపీఎస్‌తో అను సంధానం కలిగిన పర్మిట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, తాజాగా మెట్రిక్ టన్ను ఇసుక చార్జీలను జిల్లా ఇసుక కమిటీ నిర్ధారించింది. ఉంగుటూరు వద్ద మెట్రిక్ టన్ను ఇసుక రూ.554, చింతలపూడి, ఏలూరుకు రూ.630, కైకలూరు, నూజివీడులకు రూ.730 ధరలను జిల్లా ఇసుక కమిటీ నిర్ధారించింది. ఉంగుటూరు నియోజక వర్గానికి చేబ్రోలు స్టాక్ పాయింట్‌ను కేవీవీఎస్ ఎన్ ఎస్టేట్స్, చింతలపూడి నియోజక వర్గానికి షన్వీ కనస్ట్రక్షన్స్, ఏలూరు నియోజ క వర్గానికి చొదిమెళ్ల వద్ద స్టాక్ పాయింట్ బీఆర్‌సీ కన్ స్ట్రక్షన్స్, కైకలూరు (చావలి పాడు), నూజివీడు (మీర్జాపురం)స్టాక్ పాయింట్ ను గోదావరి, కృష్ణా వాటర్ వేస్‌లు టెండర్లు దక్కించుకున్నాయి. వారంతా నిర్దేశిత గడువులోగా ఇసుక నిల్వలను తరలించడానికి ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.
నెలాఖరులోగా తరలింపు
తాడిపూడి ఇసుక రీచ్ నుంచి జీపీఎస్ కూడిన రవాణా వాహనాలతో స్టాక్ పాయింట్లకు కాంట్రాక్టర్లు ఇసుక నిల్వ లను తరలించేలా ఏర్పాట్లు చేశారు. జూన్ మొదటి వారంలో రుతుపవనా ల తాకిడితో భారీవర్షాలకు అవకాశం ఉండ డంతో ఈలోగా అంటే ఈ నెలా ఖరులోగా ఐదు స్టాక్ పాయింట్ల వద్దకు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలను తరలించనున్నారు. జూన్ మొదటి వారం నుంచి ప్రతీ నియోజక వర్గంలో ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచను న్నారు. జూన్ నుంచి అక్టోబరు నెలాఖరు వరకు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు సరి పోతాయని అంచనా వేశామని, పారదర్శఽకంగా ఇసుక నిల్వలను స్టాక్ పాయింట్ల వద్ద ఉంచేం దుకు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు.