ఇసుక గుట్టలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:15 AM
ప్రభుత్వ ముందస్తు చర్యలతో సామాన్యులకు ఇసుక అందుబాటులోకి వచ్చింది.
నియోజకవర్గాల వారీగా స్టాక్ పాయింట్‌లు
ఎక్కడికక్కడ నిల్వలు సిద్ధం
సామాన్యులకు అందుబాటులో ఇసుక
ప్రభుత్వ ముందస్తు చర్యలతో సామాన్యులకు ఇసుక అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇసుక ర్యాంపులు మూతపడినా ఎక్కడికక్కడ ఇసుక నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. నియోజకవర్గానికి ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటుచేసి ఇసుక నిల్వ చేశారు. ఈ నిల్వలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించాలి. బిల్డర్లు, గృహ నిర్మాణదారులు సైతం ముందస్తుగా నిల్వ చేసుకోవడంతో ఇసుక కొరత లేదు. ప్రస్తుతం పడవలపై కూడా ఉచిత ఇసుక లభిస్తుండడంతో స్టాక్ పాయింట్‌లలో నిల్వలు కదలడం లేదు.
తాడేపల్లిగూడెం రూరల్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం నిర్మాణ రంగం మందకొడిగా ఉన్నా వాతావ రణం అనుకూలంగా ఉండడంతో నిర్మాణ పనులు సా గుతున్నాయి. సామాన్యులు ఇళ్ల నిర్మాణం, ఇతర పను ల కోసం అవసరమయ్యే ఇసుక అందుబాటులో ఉంది. వర్షాకాలం ఇసుక కొరత లేకుండా నియోజకవర్గాల వారీగా స్టాక్ పాయింట్‌లు ఏర్పాటు చేశారు. ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉంది. గతంలో ఇదే సమయంలో మూడు యూనిట్‌ల ఇసుక ధర గరిష్ఠంగా రూ.20వేల వరకూ విక్రయుంచారు. ప్రస్తు తం మూడు యూనిట్‌ల ధర కిరాయితో కలిపి రూ.5 వేల నుంచి రూ.5,500 ధరకు లభిస్తోంది. నిర్మాణాలు చేసుకునేవారికి ఇసుక అందుబాటులో కనిపిస్తోంది.
నిల్వ చేసుకున్నారు
ప్రభుత్వం ఉచిత ఇసుక అందుబాటులోకి తేవడం తో ఇసుక నిల్వలపై ఆంక్షలు తగ్గాయి. వ్యాపారులు, మరో పక్క బిల్డర్లు, భవణ నిర్మాణదారులు ముందస్తు గా నిల్వ చేసుకోవడంతో ఇసుక మార్కెట్ సరళంగా మారింది. సీజన్‌లో ఇసుక నిల్వ చేయడం ద్వారా భారీ లాభాలు పొందవచ్చని భావించిన వ్యాపారుల అంచ నా తప్పింది. ఇసుక మార్కెట్ ధరలకు విక్రయుస్తూ నిల్వలు ఖాళీ చేసుకునే పనిలో ఉన్నారు.
మందకొడిగా ఇసుక వ్యాపారం..
గతంతో పోలిస్తే ఇసుక వ్యాపారం ప్రస్తుతం మంద కొడిగా ఉంది. జిల్లాలో ఈ సీజన్‌లో రోజుకు సుమారు 6 వేల మెట్రిక్ టన్నుల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం 2వేల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఇసుక రవాణా పై ఆధారపడే లారీలు, ట్రాక్టర్లు కూలీలు అరకొర పను లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
ఆందోళనలో కాంట్రాక్టర్లు
ప్రతీ నియోజకవర్గంలో ఒక స్టాక్ పాయింట్‌లో సుమారు 65వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్టాక్ పాయింట్‌ల కోసం ప్రతీ నియోజకవర్గంలో కాంట్రాక్టర్ల పెట్టుబడి వస్తుం దా అని అయోమయంలో ఉన్నారు. ఇసుక రవాణాకు రెండు నెలలే అవకాశం ఉండడంతో స్టాక్ పాయింట్ కాంట్రాక్టర్లు ఆందోళనతో మునిగారు.
అందుబాటులో ఇసుక
ఇసుక ధర అందుబాటులో ఉంది. గతంతో ర్యాంపులు మూసివేసిన సమయంలో ఇసుక ధరలు ఆకాశాన్నంటాయి. దీనితో ప్రస్తుత సీజన్‌లో భారీగా ఇసుక నిల్వ చేయడం కాంట్రాక్టర్లకు కలిసి రాలేదు. ఇసుక ధర సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది.
మేకా దుర్గారావు, మేస్త్రి, తాడేపల్లిగూడెం
కొరత లేదు
ఇసుక ధరలు ఈ సమయంలో అందుబాటులో ఉన్నాయి. ఈ వర్షాకాలం పనులు చేసేందుకు ఇసుక దొరకదనే ఆలోచనలో పనులు చేసేందుకు నిర్మాణదారులు ముందుకు రారు. కానీ ఇసుక అందుబాటులో ఉండటం ఎంతో ఆనందంగా ఉంది.
డి.అయ్యప్ప, ఇంటి నిర్మాణదారు, మాధవరం