దిగొచ్చిన ఇసుక
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:11 AM
జిల్లాలో ఇసుక ధరలు అందుబాటులోకి వచ్చాయి. పాత పశ్చిమగోదావరి జిల్లాలోని అయా ప్రాంతాలను బట్టి ఆరు యూనిట్ల ఇసుక రూ.10వేల నుంచి 11వేలు ఉంది.

ఆరు యూనిట్లు రూ.10వేలు
ధర తగ్గినా డిమాండ్ లేదు
ర్యాంపులలో ఆగని దందా
బిల్లు లేకుండా లారీ ఇసుక రూ.5వేలు
బిల్లు కావాలంటే అదనం
జిల్లాలో తగ్గిన భవన నిర్మాణాలు
ప్రభుత్వ అభివృద్ధి పనులు అంతంత మాత్రమే
జిల్లాలో ఇసుక ధరలు అందుబాటులోకి వచ్చాయి. పాత పశ్చిమగోదావరి జిల్లాలోని అయా ప్రాంతాలను బట్టి ఆరు యూనిట్ల ఇసుక రూ.10వేల నుంచి 11వేలు ఉంది. అయితే ర్యాంపులలో అదనపు ధర వసూళ్లకు అడ్డు కట్ట వేస్తే ఇసుక ధర మరింత తగ్గే అవకాశం ఉంది. బిల్లు అడిగితే సంబంధిత ర్యాంపులో నిర్దేశిత ధర ఎంత ఉందో అంత తీసుకుని మరో రూ.5వేలు అదనంగా వసూలు చేస్తున్నారని లారీ యజమానులు చెబుతున్నారు.
పాలకొల్లు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): వాస్త వానికి ఇసుక ర్యాంపులలో ఐదు యూనిట్లు ఎగుమతి చేస్తున్నప్పటికీ అయా లారీలలో ఆరు యూనిట్లు తరలిస్తున్నారు. ఇలా అదనం గా ఇసుక రావటం వినియోగదారులకు కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ ర్యాంపులలో అదనపు వసూళ్లు ఆగితే ఇసుక ధర కనిష్ట స్థాయికి వచ్చే అవకాశం ఉంది. ఇసుక ధరలు అందుబా టులోకి వచ్చినప్పటికీ నిర్మాణ రంగం నత్తన డకన నడుస్తున్నది. మార్కెట్‌లో ఆర్థిక మాం ద్యం తాండవిస్తుండటం, ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం నాలుగో త్రైమాసికం చివర దశలో ఉండటంతో నిర్మాణ పనులు సన్నగిల్లాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అభివృద్ధి పను లు కొంత మేరకు మెరుగుపడవచ్చని నిపుణు లు అంచనా వేస్తున్నారు.
నిర్మాణ రంగం నత్తనడక
ప్రభుత్వ పరంగా సీసీరోడ్లు నిర్మాణానికి టెండర్లు పిలిచి ఆమోదించినప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఇంకా అధిక శాతం పనులు ప్రారం భించలేదు. జిల్లాలో వ్యక్తగత భవన నిర్మాణాలు, అపార్టుమెంట్ నిర్మాణాలు నాలుగింట రెండు వంతుల తగ్గాయి. ఈకారణంగా ఇసుక ధర అందుబాటులో ఉన్నప్పటికీ నిర్మాణం అంతంత మాత్రంగానే ఉంది. మరో వైపు విపణిలో నగదు కష్టాలు తగ్గడంతో భవన నిర్మాణ సామగ్రి ధరలు తగ్గినప్పటికీ అంతగా భవనాలు నిర్మించ డానికి పౌరులు ఆసక్తి చూపించడం లేదు. జిల్లాలోని పలు పట్టణాల్లో ఇప్పటికే ఎన్టీఆర్ టిడ్కో గృహాలలో ఆక్యుపెన్సీ పెరిగింది. ఈకార ణంగా పట్టణాలలోని మధ్యతరహా అద్దె ఇళ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. గతంలో సంపన్నులు ఖాళీ జాగా ఉంటే భవనాలు నిర్మించి అద్దెకు ఇచ్చే వారు. ఇప్పుడు ఆ సాహసం చేయడం లేదు. స్థిరాస్తులు కంటే బంగారంపై పెట్టుబడి పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకోవచ్చని అధిక శాతం మధుప రులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈకా రణంగానూ స్థిరాస్తులు క్రయవిక్రయాలు తగ్గు ముఖం పట్టాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు వంటి పట్టణాలలో వేలసంఖ్యలో టిడ్కో ఇళ్లు జూన్ నాటికి లబ్ధిదారులకు అంద జేయటానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. పూర్తి స్థాయిలో టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందచేస్తే ఆయా పట్టణాలలో వేల సంఖ్యలో అద్దె ఇళ్లు ఖాళీ అవుతాయి. ఇది దృష్టిలో పెట్టు కుని ఇళ్లు నిర్మించాలనే ఆలోచనను పలువురు విరమిస్తున్నారు. 120గజాలు స్థలంలో ఒక అంతస్తు ఇల్లు కట్టాలన్నా స్థలంతో పాటు కలుపుకుని రూ.40 లక్షల నుంచి 50లక్షలు ఖర్చు అవుతుంది. వచ్చే ఒకటి రెండేళ్లలో పట్ట ణాలలోని చిత్తడి ప్రాంతాల్లోని గృహాలు పట్ట ణాలకు దూరంగా ఉన్న మధ్య తరహా ఇళ్లు ధరలు ఘణనీయంగా తగ్గుతాయని పరిశీలకు లు అంచనా వేస్తున్నారు. దీంతో చిరుద్యోగులు చిరువ్యాపారులు తక్కువ ధరకు పాత ఇళ్ళే కొనుగోలు చేసి మరమ్మతులు చేయించుకుంటే తక్కువ బడ్జెట్‌లో సొంత ఇల్లు అమరుతుందనే ఆలోచనలో ఉన్నారు. ఇలా కొన్ని కారణాలుగా పాత పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుకకు డిమాం డ్ తగ్గింది. ధర అందుబాటులో ఉన్నప్పటికీ డిమాండ్ లేకపోవడంతో లారీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఒక వైపు ఇసుక ర్యాం పులలో అక్రమంగా అదనపు వసూళ్లుతో కిరా యిలు కిట్టుబాటు కావడం లేదని లారీ యజ మానులు చెబుతున్నారు. రోజుకి రెండు లారీలు ఇసుక రవాణా చేయగలిగితే డీజిల్, డ్రైవర్ ఇతర ఖర్చులు పోను రోజుకి రెండు వేలు మిగలటం గగనం అవుతుందని లారీ యజమా నులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ర్యాంపు లలో అక్రమ వసూళ్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తు న్నాయి. ఉచిత ఇసుక ఊతపదంగా మిగలకూ డదని ప్రభుత్వం అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరు తున్నారు.