Share News

సదరం తరలిపోయింది..!

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:00 AM

దివ్యాంగుల వైకల్యం పరిశీలించేం దుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సదరం శిబిరాన్ని కైకలూరు నుంచి ఏలూరు తరలించేశారు.

 సదరం తరలిపోయింది..!
కైకలూరు సదరం శిబిరంలో దివ్యాంగులు (ఫైల్‌)

కైకలూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల వైకల్యం పరిశీలించేం దుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సదరం శిబిరాన్ని కైకలూరు నుంచి ఏలూరు తరలించేశారు. సదరం క్యాంప్‌ కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించాల్సి ఉండగా అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఏలూరు తర లించడంపై దివ్యాంగుల కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కైకలూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రతీ బుధవారం ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో సదరం శిబిరం నిర్వహించేవారు. కదలలేని పరిస్థితిలో ఉన్నవారిని కారు, ఆటోలో ఏలూరు తీసుకెళ్లడానికి రూ.8వేల నుంచి రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముదినేపల్లి, కలిదిండి మండలాల శివారు గ్రామాల వారు 60 కిలోమీటర్లు ప్రయాణిం చాలి. కైకలూరు మండలంలో 581, కలిదిండి మండలం 344, ముదినేపల్లి మండలం 322, మండవల్లి మండలంలో 281 మంది దివ్యాంగులున్నారు. వైకల్య ధ్రువీకరణ పత్రాలు అందిస్తేనే పెన్షన్‌, రాయితీలు వర్తిస్తాయి.

Updated Date - Jul 16 , 2025 | 01:00 AM