ఆర్టీసీ పెట్రోలు తాగేశారు!
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:56 AM
జిల్లా కేంద్రమైన ఏలూరు ఆర్టీసీ బంకులో సంస్థ సిబ్బంది అక్రమాలకు తెరతీశారు. . లక్షలాది రూపాయలు స్వాహా చేశారు.
ఐదేళ్లలో రూ.83 లక్షలు స్వాహా
ఏడీసీ, మరో 14 మందిపై విచారణ పూర్తి
నేడో, రేపో బాధ్యులపై చర్యలు
జిల్లా కేంద్రమైన ఏలూరు ఆర్టీసీ బంకులో సంస్థ సిబ్బంది అక్రమాలకు తెరతీశారు. . లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. అసిస్టెంట్ డిపో క్లర్క్ ప్రధాన సూత్రధారుడిగా ఆరోపణలున్నాయి. ఆయనతో పాటు మరో 14 మంది అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ఏకమయ్యారు. బిల్లులకు లెక్కచూపకుండా దాదాపు రూ.83 లక్షలు స్వాహా చేశారు. అధికారులు నెలరోజుల పాటు తనిఖీలు, విచారణ పూర్తి చేశారు. బాఽధ్యులపై చర్యలకు సమాయత్తం అవుతున్నారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ఏలూరు కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ నిర్వహణలో ఉన్న పెట్రోలు బంకులో ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. 2021లో వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి రవా ణాశాఖ మంత్రి పేర్నినాని ఈ బంకు ప్రారంభించారు. ఆర్డీసీ డిపో, కార్గో అసిస్టెంట్ మేనేజర్లు పర్యవేక్షణ లేకపోవడంతో ఏడీసీ స్థాయి క్లర్క్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది లక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారు. ఇటీవల ఆడిటిం గ్ అధికారులు తనిఖీ చేయగా రూ.83 లక్షల మేర బిల్లులకు లెక్కలు, రశీదులు లేవు. రికార్డుల్లో తేడాతో అవకతవకలు జరిగినట్లు తేలింది. తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారులు, విజిలెన్స్, ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్లు కూడా ఆరా తీయడంతో ఈ మొత్తాలను సొంతానికి వాడే సుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
డిజిటల్ పేమెంట్ నొక్కేశారు
2021–2025 మధ్య కాలంలో రోజూ బం కులో నగదు జమ, గూగుల్, ఫోన్‌పే మొత్తా లను బిల్లులతో కలిపి సంస్థ పేరిట జమ చేయాల్సి ఉంది. ప్రతీ రోజు సుమారు నగదు రూ.4లక్షలు, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.40 వేలు వసూలైతే మరుసటి రోజు చేతివాటం ప్రదర్శించారు. ఫోన్‌పే లావాదేవీల పాత బిల్లులను ఆ మొత్తాలతో భర్తీ చేసి నిధులు స్వాహా చేశారు. ఇందులో ఏడీసీ పాత్ర కీలకంగా చెబుతున్నారు. అతని సొంత బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు ఆరా తీస్తే వాస్తవాలు బయటపడతాయని చెబుతున్నా రు. ఆడిట్ లెక్కల్లో తేడాగా పరిగణించిన మొత్తాన్ని స్వాహా చేసినట్లు గుర్తించి బాధ్యులపై కేసులు లేకుండా చేయాలని చూస్తున్నారని చెబుతున్నారు.
కొంత మొత్తం జమ?
ఇదిలా ఉండగా బంకు లావాదేవీలు పర్య వేక్షించాల్సిన వారు ఉద్యోగాలు కోల్పోతామన్న భావనతో కొన్ని లక్షలు నగదు సంస్థకు జమ చేసినట్లు తెలిసింది వారిపై సంస్థాగత చర్య లు లేకుండా చూసుకునే విధంగా జాగ్రత్త పడినట్లు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సిబ్బందిని కాపాడడానికి ఎత్తుగడ అయి ఉండవచ్చని చెబుతున్నారు.
అధికారుల మాటే మిటి?
బంకు లావాదేవీలపై సంస్థ అధికారులు ఆడిట్ చేయలేదు. పర్యవేక్షణ చేయని డీఎం లు, ఇతర పర్యవేక్షణాధికారులను విచారించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు సూత్రధారులెవరో ఉన్నతాధికారుల చర్యలతోనే బయటపడుతుందని చెబుతున్నారు. ఈ విషయంపై డీపీటీవో షేక్ షబ్నం మాట్లాడుతూ అవకతవకలపై కచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు.