Share News

రైట్‌.. రైట్‌..

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:28 AM

ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అధికారులు చర్యలు చేపట్టారు.

రైట్‌.. రైట్‌..
నూజివీడు బస్టాండ్‌ పరిశీలిస్తున్న డీపీటీవో షేక్‌ షబ్నం(ఫైల్‌)

ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు

బస్సుల ఫిట్‌నెస్‌పై అధికారుల దృష్టి

అవుట్‌ సోర్సింగ్‌ డ్రైవర్ల నియామకాలకు చర్యలు

బస్టాండ్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు

మహిళలకు అదనపు బెంచ్‌లు సిద్ధం

మరుగుదొడ్డి సౌకర్యం మెరుగుదలకు ఆదేశాలు

మంచినీరు, లైటింగ్‌ ఏర్పాట్లు

ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు 15 నుంచి మహిళల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రజారవాణా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో వివిధ రూట్లలో తిరిగే పల్లెవెలుగు, ఆల్ర్టా పల్లెవెలుగు బస్సుల మరమ్మతులు దాదాపు 80 శాతం పూర్తి చేశారు. బస్సులు ఎక్కడ ఏ కారణం చేతనైనా ఆగిపోకుండా ఉండేలా పూర్తిగా ఫిట్‌గా చేస్తున్నారు. మొత్తంగా 160 బస్సులు పూర్తి ఫిట్‌నెస్‌తో సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే నెల 15 నుంచి ఉచిత ప్రయాణ సౌక ర్యం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవ డంతో క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మహిళల ప్రయాణానికి అనువుగా బస్సులను ఎక్కువ ట్రిప్‌లు నడిపే అవకాశాలున్నాయి. అవుట్‌ సోర్సింగ్‌లో డ్రైవర్ల ను ప్రతీ డిపో పరిధిలో 15 మంది చొప్పున అదనంగా సిద్ధం చేసుకుంటున్నారు. ఏలూరు ప్రజా రవాణాశాఖాధికారి షేక్‌ షబ్నం ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం డిపోల పరిధిలో రూట్లను పరిశీలించారు. సౌకర్యాలు కల్పించే దిశగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

ప్రభుత్వం విధివిధానాలు ఇంకా ప్రకటించ కున్నా మహిళలు ఆధార్‌ను కలిగి ఉండడం తప్పనిసరి. ఉచిత ఫేర్‌ టిక్కెట్‌ జారీ చేయ డం తప్పనిసరి చేశారు. రోజూవారి ఎంత మంది ప్రయాణిస్తున్నారని అంచనా వేయవ చ్చు. ఉచిత ప్రయాణాలు ఉమ్మడి జిల్లా వరకే అనుమతి ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లోనే పూర్తి విధివిధానాలు రానున్నాయని సమాచారం. ఈలోగా ఆర్టీసీ బస్‌ డిపోల్లో సకల ఏర్పాట్లను చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. మహిళా ప్రయాణికుల కోసం కుర్చీలు పెంచుతున్నారు.

రోజూ 40 వేల మంది ప్రయాణం!

జిల్లాలో ఉచితంగా బస్సుల్లో మహిళలు ప్రయాణించే వారి సంఖ్య 40వేలు ఉండవచ్చ ని అధికారుల ప్రాథమిక అంచనా. ఉదయం 8 గంటల నుంచి 11 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు మహిళలు ప్రయాణాలు చేసే అవకాశం ఉందని భావి స్తున్నారు. మహిళల ప్రయాణాలకు అనుగు ణంగా బస్టాండ్‌లలో అదనపు సౌకర్యాలు సమకూరుతుండడం విశేషం. ఏలూరు బస్టాం డ్‌లో ఫ్లాట్‌ఫారాలపై లైటింగ్‌ ఏర్పాటు చేయ గా, బస్సులు నిలుపుదల చేసే చోట హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఏలూరు ప్రధాన బస్టాండ్‌తో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీ డు బస్‌ స్టేషన్లలో సౌకర్యాలను విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏలూరు కొత్త బస్టాండ్‌లో జంగారెడ్డిగూడెం వెళ్లే బస్సు లు ఆగేచోట్ల పబ్లిక్‌ టాయిలెట్లను సిద్ధం చేశా రు. స్టాల్స్‌ మధ్యలో మంచినీటి డ్రమ్ములకు అదనంగా నీరు తీసుకునేందుకు మోటార్ల అమరిక చేస్తున్నారు. నూజివీడు బస్టాండ్‌లో ప్రయాణికులు ఆగి, దిగే చోట టైల్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మంచినీరు, ఇతర సౌకర్యాలను విస్తరించే పనిలో ప్రతిపాదనలు పంపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో టాయిలెట్లు నిర్మాణం, ఇతర సౌకర్యాలను పెంచనున్నారు.

Updated Date - Jul 30 , 2025 | 12:28 AM