Share News

ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:47 AM

అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వా లని తాజాగా శుక్రవారం నిర్ణయించింది.

ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట

మెడికల్‌ అన్‌ఫిట్‌ కోటాలో ఐదుగురికి లబ్ధి

ఏలూరు,డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వా లని తాజాగా శుక్రవారం నిర్ణయించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనంతరం నుంచి ఈ చర్యలను చేపట్టాలని ఆదేశించింది. 2020 జనవరి 1 తర్వాత మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఏలూరు జిల్లాలో మెడికల్‌ బోర్డు సర్టిఫై చేసిన ఐదుగురు ఈ కోటాలో ఉన్నట్టు గుర్తించామని ఏలూరు డీపీటీవో షేక్‌ షబ్నం తెలిపారు. గ్యారేజీ శ్రామిక్‌, ఎన్సౌనర్లు, ఇతర విభాగాల్లో ఆ ఐదుగురుకి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టింగ్‌లు కల్పించనున్నట్టు తెలిపారు.

Updated Date - Dec 27 , 2025 | 12:47 AM