దివ్యాంగులకు వరం
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:36 PM
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగు లకు తీపికబురు చెప్పిం ది. మహిళల మాదిరిగానే ఆర్టీసీలో వీరికి ఉచిత ప్రయాణాల వర్తింపునకు నిర్ణయించింది.
ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి పచ్చజెండా
జిల్లాలో 1.49 లక్షల మంది దివ్యాంగులు
ప్రస్తుతం 1,116 మందికి 50 శాతం రాయితీ.. జీవో వస్తే పూర్తిసంఖ్యపై స్పష్టత
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగు లకు తీపికబురు చెప్పిం ది. మహిళల మాదిరిగానే ఆర్టీసీలో వీరికి ఉచిత ప్రయాణాల వర్తింపునకు నిర్ణయించింది. ఈ మేరకు దివ్యాం గులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటి వరకు వీరంతా టిక్కెట్‌లో 50 శాతం రాయితీ పొందుతున్నారు. త్వరలో వీరికి పూర్తిస్థాయిలో ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు ప్రకటించారు.
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం వరమిచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని ఇకపై ఉచితంగా కొనసాగించవచ్చు. ప్రస్తుతం జిల్లాలో దివ్యాంగులకు ఆర్టీసీ నాలుగు రకాల పాస్‌లను జారీ చేస్తోంది. 40 శాతం శారీరక వైకల్యం, 100 శాతం వినికిడి లోపం, 100 శాతం అంధత్వం, 69 శాతం కంటే తక్కువ ఐక్యూతో మానసిన వైకల్యం ఉంటే వారికి ఆర్టీసీ పాస్‌లను జారీ చేస్తోంది.
జిల్లాలో 1.49 లక్షల మంది దివ్యాంగులు
జిల్లాలో వికలాంగుల సంక్షేమశాఖ లెక్కల ప్రకారం దివ్యాంగులు 1.49 లక్షల మంది ఉన్నారు. ఇందులో వికలాంగత్వం శాతాలున్న వారికే ఉచిత బస్సు ప్రయా ణాలు వర్తిస్తాయి. మహిళల పరంగా దివ్యాంగులు ఉచితంగా అందుకుంటున్నారు. వీరి సంఖ్య కూడా తెలియని పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ జారీచేసిన విధంగా చూస్తే ప్రస్తుతం 1116 మంది 50 శాతం రాయితీ పొందుతున్నారు. వీరు కాకుండా వికలాంగత్వం ఉన్నవారికి ఏ విధంగా ఆర్టీసీ రాయితీ వర్తింప చేస్తారన్నది జీవో రూపంలో మార్గదర్శకాలు జారీ కావాల్సి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఎంతో మేలు చేకూరుతుంది..
మాలాంటి దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉన్న 50 శాతం రాయితీని నూరుశాతం అమలు చేయాలని నిర్ణయించడం సంతోషదాయకం. ఇకపై దివ్యాంగులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిం చేందుకు అవకాశం కల్పించడం శుభపరిణామం. దివ్యాంగులపై ఛార్జీలు భారం తొలగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలు చేకూరుతుంది. పేద విద్యార్థులు, వృద్ధులకు మరింత ఉపయోగకరం. త్వరితగతిన అమలు చేస్తారని భావిస్తున్నాం.
– నక్కపాము రాంబాబు , ఏలూరు
ఉత్తర్వులు రావాలి
దివ్యాంగులకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణాలను ప్రభుత్వం కల్పించినట్టు వార్తల్లో చూశాం. అధికారి కంగా మాకు జీవో రావాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నది తెలియదు. మార్గదర్శ కాల ప్రకారం తాము ఏర్పాట్లు చేస్తాం.
– డీపీటీవో షేక్ షబ్నం