ఆర్టీసీ ఉద్యోగుల అక్రమ సస్పెన్షన్
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:31 PM
ఆర్టీసీ ఏలూరు పెట్రోల్ బంకులో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మూడో రోజు డిపో ముందు ఆదివారం పలు యూనియన్ల నాయకులు నిరసన చేపట్టారు.
నేడు నిరాహార దీక్షకు నిర్ణయం
ఏలూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఏలూరు పెట్రోల్ బంకులో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మూడో రోజు డిపో ముందు ఆదివారం పలు యూనియన్ల నాయకులు నిరసన చేపట్టారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యద ర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ గత నాలుగేళ్లు జరిగిన రూ.82 లక్షల అమ్మ కాల్లో కుంభకోణంపై విచారణ పూర్తిస్థాయిలో జరగకుండా, డబ్బులు కట్టలేని వారిని సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. పెట్రోల్ బంకు ఏర్పాటు చేసిన ప్పటి నుంచి ఇప్పటివరకు పనిచేసిన డిపో మేనేజర్లు, జిల్లాస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. దిగువస్థాయి ఉద్యోగులపై చర్యలను ఖండిస్తూ యాజమాన్య వైఖరికి నిరసనగా సోమవారం నుంచి నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్ వీడీ ప్రసాద్ మాట్లాడుతూ నాలుగేళ్ల నుంచి కుంభకోణం జరుగుతుంటే ఉన్న తాధికారులు ఏం చేశారని ప్రశ్నించారు. ఆడిటర్ సుందరయ్య, ఎమ్మెస్‌రావుతో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేయడం సరి కాదన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆంజనేయులు, బాబూరావు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.