Share News

భీమవరంలో డయాలసిస్‌ సెంటర్‌కు రూ.75 లక్షలు

ABN , Publish Date - Oct 22 , 2025 | 01:09 AM

భీమవరం పరిసర ప్రాంతాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శుభవార్త.

  భీమవరంలో డయాలసిస్‌ సెంటర్‌కు రూ.75 లక్షలు

భీమవరం టౌన్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి):భీమవరం పరిసర ప్రాంతాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. భీమవరం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు రూ.75 లక్షలు నిధులు మంజూర య్యాయి. ప్రధాన మంత్రి జాతీయ డయాలసిస్‌ ప్రో గ్రాంలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా ఏడు డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు వెలువడ్డాయి. అందులో భీమవరం కూడా ఉంది. ప్రతీ కేంద్రంలోను మూడు సెషన్స్‌ ద్వారా 15 మందికి చొప్పున రక్త శుద్ధి జరిగేలా రూ.75 లక్షలతో మూడు యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే జిల్లాలో ఆకివీడులో డయాలసిస్‌ సెంట ర్‌ పనిచేస్తోంది. త్వరలో ఆచంటలోను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రతిపాదనలో వున్న భీమవరానికి ఇప్పుడు నిధులు కేటాయించారు. త్వరలో మిషన్‌లు ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకురానున్నారు. కిడ్నీలో సమస్య ఏర్పడి రక్తాన్ని శుద్ధి చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు శరీరంలో విష పదార్థాలు, అధికనీరు, ఉప్పులాంటి వ్యర్థాలను ప్రమాదకర స్థాయి కి చేరతాయి. ఆ సమస్యలో వాటిని తొలగించేందుకు ఈ కృత్రిమ ప్రక్రియను చేపట్టి రక్తాన్ని శుద్ధి చేస్తారు.

Updated Date - Oct 22 , 2025 | 01:09 AM