Share News

మొగల్తూరు రోడ్లకు రూ.70 కోట్లు

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:49 AM

మొగల్తూరు పంచాయతీ పరిధిలో రహదారుల అభివృద్ధికి అడుగు ముందుకు పడింది.

మొగల్తూరు రోడ్లకు రూ.70 కోట్లు
రహదారుల అభివృద్ధి ప్రతిపాదనలను అధికారులకు వివరిస్తున్న సర్పంచ్‌ పడవల మేరీ

ప్రతిపాదనలు సిద్ధం చేసిన పంచాయతీ పాలకవర్గం

డిప్యూటీ సీఎం ఆదేశాలతో గ్రామంలో పర్యటించిన ఇంజనీర్లు

మొగల్తూరు, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): మొగల్తూరు పంచాయతీ పరిధిలో రహదారుల అభివృద్ధికి అడుగు ముందుకు పడింది. పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌, డీఈ డి.సత్యనారా యణ, ఏఈ వెంకటేశ్వరరావు శుక్రవారం గ్రా మంలో రహదారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో గత 28న మొగల్తూరులో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ గ్రామాభివృద్ధి సమావేశం నిర్వహించి వినతులు తీసుకున్నారు. తొలి ప్రాధాన్యతగా ఉన్నత పాఠశాలకు రూ.1.71 కోట్లు మంజూరురయ్యాయి. రెండో ప్రాధాన్యతగా రహదారి పక్కన డంప్‌ చేసిన చెత్తను స్వచ్చ ఆంధ్ర టీమ్‌ సభ్యులతో తరలిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో గల పంచాయతీ రాజ్‌ శాఖ శాఖ నుంచి చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలో అంతర్గత రహదారులు, గ్రామాల మధ్య రహదారులు, అంగన్‌వాడీ, మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ప్రతిపా దనలు కోరుతూ ఈనెల 8న ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికనుగుణంగా గ్రామంలో రహదారులకు రూ. 70 కోట్లు అంచనాలతో పంచాయతీ రూపొందించిన ప్రతిపాదనలు సర్పంచ్‌ పడవల మేరీ ఇంజనీరింగ్‌ అధికారులకు శుక్రవారం అందజే శారు. ఈ ప్రతిపాదనలు మండల పరిషత్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌కు పంపారు. అక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి పేషీకి వెళ్లనున్నాయి. మొగల్తూరు గ్రామాభివృద్ధికి పవన్‌ కల్యాణ్‌ కృషిపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:49 AM