Share News

రూ.అరకోటి స్వాహా !

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:37 AM

పోతునూరు భోగేశ్వరస్వామి సహకార సొసైటీలో మాజీ అధ్యక్షుడు దూళిపాళ నాగేంద్రవరప్రసాద్‌(బజ్జీ) హయాంలో జరిగిన అవినీతి లెక్కతేలింది.

రూ.అరకోటి స్వాహా !

నిబంధనలకు విరుద్ధంగా నిధులు పక్కదారి

కోర్టు ఆదేశించినా చర్యలు శూన్యం

మాజీ అధ్యక్షుడు బజ్జీ మోసాలు వెలుగులోకి..

కూటమి ప్రభుత్వం రాకతో చర్యలు.. బాధితులకు రూ.2.20 కోట్లు చెల్లింపు

దెందులూరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి):పోతునూరు భోగేశ్వరస్వామి సహకార సొసైటీలో మాజీ అధ్యక్షుడు దూళిపాళ నాగేంద్రవరప్రసాద్‌(బజ్జీ) హయాంలో జరిగిన అవినీతి లెక్కతేలింది. వివిధ పార్టీలను అడ్డం పెట్టుకుని పదేళ్లపాటు ఇష్టారాజ్యంగా విధుల నిర్వహణతో రూ.అర కోటిపైనే స్వాహా చేసినట్టు అధికారులు గుర్తించారు. 2013 నుంచి 2019 వరకు ఆయన, అనంతరం భార్య రమాదేవి రెండేళ్లపాటు సొసైటీ చైర్మన్‌గా కొనసాగారు. ఈ కాలంలో రూ.2 కోట్ల 49 లక్షల నిధులు పక్కదారి పట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా ష్యూరిటీలు లేకుండా అనుచరులకు, పార్టీ వారికి లక్షల్లో రుణాలు ఇవ్వడం పెద్ద దుమారం రేపింది. వైసీపీ హయాంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న అంశం పై టీడీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు 2022లో నాగేంద్రపై చర్యలు తీసుకోవాలని అప్పటి కలె క్టర్‌ ప్రసన్నకుమార్‌ను ఆదేశించింది. రాజకీయ పలుకుబ డితో ఆ ఆదేశాలను తుంగలో తొక్కారు.

వైసీపీలోనూ కోర్టుకు.. చర్యలు శూన్యం

2023లో వైసీపీ అధికారంలో ఉండగానే, కొందరు వైసీపీ నాయకులు వాళ్ల అనుచరులతో బజ్జీ అవినీతికి పాల్పడినట్టు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించినప్పటికి ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వారిని వారించడంతో కేసు అలా నీరుగారింది. తర్వాత బ్యాంకు దివాళా తీసిందని రూ.2 కోట్ల 40 లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చెల్లించలేదు. దీంతో డిపాజిట్లుదారులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఇంత అక్రమాలు చేసినా త్రిసభ్య కమిటీ నియామకంలోను బజ్జీ సతీమణి రమాదేవి చైర్మన్‌ గిరిని అప్పటి ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారులోకి రావడంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఈ సొసైటీ అవినీతిపై దృష్టి పెట్టారు. మరోవైపు ఇటీవల ఏర్పడిన త్రిసభ్య కమిటీ చైర్మన్‌ బొడ్టేటి మోహన్‌బాబు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.2 కోట్ల 40 లక్షలకుగాను రూ.2 కోట్ల 20 లక్షలు చెల్లించారు. ఇంకా రూ.20 లక్షలు చెల్లిం చాలి. సహకారశాఖ అధికారులు చేపట్టిన 51వ విచారణ లో రూ.51 లక్షలు దుర్వినియోగం జరిగినట్టు గుర్తించారు. ఈ అవినీతిపై డిప్యూటీ రిజిస్ర్టార్‌ కె.సత్యవతి దెందు లూరు పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేయగా ఆది వారం రాత్రి బజ్జీని పోలీసులు అరెస్టు చేశారు. సోమ వారం దెందులూరు ప్రభుత్వాసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి భీమడోలు కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు.

Updated Date - Nov 18 , 2025 | 12:37 AM