నూజివీడు అభివృద్ధికి రూ.30 కోట్లు
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:15 AM
నూజివీడు నియోజక వర్గంలో వివిధ అభివృద్ధి పను లకు రూ.30 కోట్లు మంజూ రయ్యాయని మంత్రి కొలుసు పార్థ సారథి తెలిపారు.
నూజివీడు, ఆగస్టు 7 (ఆంధ్ర జ్యోతి): నూజివీడు నియోజక వర్గంలో వివిధ అభివృద్ధి పను లకు రూ.30 కోట్లు మంజూ రయ్యాయని మంత్రి కొలుసు పార్థ సారథి తెలిపారు. బుధ వారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాలువలు, చెరువు పనులకు రూ.22 కోట్లు, నూజి వీడు పట్టణా భివృద్ధికి రూ.5 కోట్లు, బలివే ఆలయ అభివృద్ధికి రెండున్నర కోట్లు మంజూరయ్యా యన్నారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు లెప్ట్ మెయిన్‌కెనాల్ పనులు నవంబర్‌లో పూర్తి అవుతాయని, రైట్ మెయిన్ కెనాల్ పనులు 2027కి పూర్తి చేస్తారని తెలిపారు. చింతలపూడి పథకానికి అడ్డంకిగా ఉన్న లీగల్ సమస్యలను త్వరలో తొలగించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయటానికి పనులు జరుగుతున్నాయన్నారు. కృష్ణానది నుంచి వృఽథాగా సముద్రంలో కలుస్తున్న జలాలను వాటా లేకపోయినా ఏపీలోని పంట సాగుకు అనుమతి కోరగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టివిక్రమార్క సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్‌ఆర్ ఈజీఎస్ పనుల బిల్లులు చెల్లించలేదని, వాటి కోసం ఈనెల 11వ తేదీలోపు బిల్లులు ఆన్‌లైన్ చేసుకో వాలని నెలాఖరుకు బిల్లులు చెల్లిస్తామని మంత్రి అన్నారు. గతంలో అర్బన్ , రూరల్ పరిధిలో నిర్మించిన గృహాలకు కొన్ని సమస్యల కారణంగా బిల్లులు చెల్లింపు జరగలేదని కేంద్రమంత్రితో మాట్లాడి త్వరలో బిల్లులు జమ చేస్తామన్నారు. నూజివీడు పట్టణాభివృద్ధికి మంజూరైన రూ.5 కోట్లు నిధులు ఒక్కొ వార్డుకు 15 నుంచి రూ.20 లక్షల వరకు సర్దుబాటు చేస్తామన్నారు.