Share News

రూ.286 కోట్లు

ABN , Publish Date - Nov 07 , 2025 | 01:08 AM

జిల్లాల సహకార కేంద్రబ్యాంకు (డీసీసీబీ) పరిధిలో మొండి బకాయిల ఏళ్ల తరబడి పేరు కుపోయి ఉన్నాయి.

 రూ.286 కోట్లు

రికవరీలపై సమీక్షలు శూన్యం

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ వర్తింపు ?

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాల సహకార కేంద్రబ్యాంకు (డీసీసీబీ) పరిధిలో మొండి బకాయిల ఏళ్ల తరబడి పేరు కుపోయి ఉన్నాయి. ఇందులో పెద్దఎత్తున ఎల్‌టీ రుణాలు తీసుకున్న బాపతే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా ఈ బకాయిల వసూళ్ల కొలిక్కి రాకపోవడం వెనుక పాలక వర్గాల పట్టింపులే కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం మొండి బకాయిల వసూలుకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) అమలు దిశగా ప్రభుత్వం యోచిస్తున్నా అది ఎంతవరకు అమ లువుతుందో వేచి చూడాలి.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 258 సొసైటీలు ఉండగా రూ.286 కోట్ల మేర మొండిబకాయిలు వసూళ్లు కావడం లేదు. ఇందులో 258 సొసైటీల పరిధిలోనే రూ.190 కోట్ల మేర బకాయిలు పేరుకుపోగా వాటి పరిధి లోని 35 బ్రాంచ్‌ల్లో రూ.96 కోట్లు మొండి బకాయిలు పేరుకుపోయాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలోని ఎని మిది సొసైటీల పరిధిలో రూ.100 కోట్ల మేర ఇతర రూపాల్లో డీసీసీబీ నిధులు పక్కదారి పట్టాయి. దీంతో బకాయిలు విపరీతంగా పెరి గాయి. కొన్ని సొసైటీల్లో రూ.3 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేరకు బకాయిలు పేరుకు పోయాయి. కిందిస్థాయిలో ఉద్యోగ సిబ్బంది కొరత వల్ల దీర్ఘకాలిక పంటలకు కోసం తీసుకున్న రుణాలు వసూలు కావడం లేదు. వైసీపీ హయాంలో పూర్తిగా వసూళ్లు పడకేశా యి. టీడీపీ ప్రభుత్వం వచ్చాకా పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది.

ఓటీఎస్‌పై కసర త్తులు..

ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద వసూలు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించడానికి తొమ్మిది మందితో ప్రభుత్వం ఇటీవల కమిటీని వేసింది. విశాఖ డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు ఆధ్వర్యంలో కమిటీని వేశారు. ఆప్కాబ్‌ ఎండీ, సీజీఎం ఆపరేషన్‌, డెవలప్‌మెంట్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని డీసీసీబీలను సందర్శించి, ఆయా జిల్లాల్లో మొండి బకాయిలు వివరాలను సేకరించనుంది. సొసైటీల నుంచి తీసుకున్న రుణం మొత్తం ఒకేసారి చెల్లించాలా ఒక ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం. అసలు చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేస్తారా? లేక తీసుకున్న రుణం కాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని అనే దానిపై కమిటీ చర్చించనుంది. అయితే ఈ కమిటీ కూడా ఇంకా సమావేశం కాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఓటీఎస్‌ అమలు చేస్తే డీసీసీబీల మూలధనం విలువ గణనీయంగా పడేపోయే ప్రమాదం ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొండి బకాయిలు వసూళ్లు జరుగుతాయా? ఓటీఎస్‌ అమలు చేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సమీక్షలు తూచ్‌

మొండిబకాయిదారుల నుంచి రెవెన్యూ రికవరీ యాక్టు కింద వసూళ్లు చేయాల్సి ఉన్న ఆ దిశగా అడుగులు పడడం లేదు. డీసీసీబీ చైర్మన్‌గా గన్ని వీరాంజనేయులు బాధ్యతలు స్వీకరించి నాలుగున్నర నెలలు అవుతున్నా ఇప్పటికీ ఒక సమీక్ష జరగలేదు. ఇదిలా ఉండగా రికవరీలు, అకవతవకలపై కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీలు కనీసం ఆరు నెలలకొక సారైనా సమీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఆ దిశగా ఇప్పటి వరకు ఒక సమీక్షా జరగలేదు. రికవరీలు, నిఽధుల స్వాహా చేసిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు లేవు. ఇందులో కొందరు సొసైటీల ఉద్యోగులు ఉండడం కొసమెరుపు.

Updated Date - Nov 07 , 2025 | 01:08 AM