Share News

చెరువుల మరమ్మతులకు రూ. 258 కోట్లు

ABN , Publish Date - Oct 24 , 2025 | 01:06 AM

జిల్లాలో మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల మరమ్మతులు, పునరుద్ధర ణ, పునర్నిర్మాణం(ఆర్‌ఆర్‌ఆర్‌) పనులకు రూ.258 కోట్ల తో ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

చెరువుల మరమ్మతులకు రూ. 258 కోట్లు
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఏలూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి):జిల్లాలో మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల మరమ్మతులు, పునరుద్ధర ణ, పునర్నిర్మాణం(ఆర్‌ఆర్‌ఆర్‌) పనులకు రూ.258 కోట్ల తో ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి జలవనరుల శాఖ, డ్వా మా అధికారులతో కలెక్టర్‌ గురువారం టెలి కాన్ఫరెన్స్‌ లో సమీక్షించారు. 1513 చెరువులకు రెండో విడత 350 చెరువులను రూ.258 కోట్లతో అభివృద్ధి చేయ నున్నట్లు తెలిపారు. వీటిపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాల న్నారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ సీహెచ్‌ దేవప్రకాష్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ త్రినాథరావు, డ్వామా పీడీ సుబ్బారావులు, భూగర్భజలశాఖ డీడీ పి.కోదండరావు, వివిధ దశల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 01:06 AM