Share News

దివ్యాంగులకు రూ.2 కోట్లు

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:25 AM

దివ్యాంగులకు స్టీల్‌ అథా రిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) ద్వారా రూ.2 కోట్లతో ఉపకర ణాలు అందజేయనున్నట్లు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.

దివ్యాంగులకు రూ.2 కోట్లు
శిబిరం ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి వర్మ, మంత్రి నిమ్మల

పాలకొల్లు టౌన్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు స్టీల్‌ అథా రిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) ద్వారా రూ.2 కోట్లతో ఉపకర ణాలు అందజేయనున్నట్లు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పాలకొల్లు మునిసిపల్‌ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల గుర్తింపు శిబిరం ఆదివారం కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీని వాసవర్మ, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారం భించారు. శ్రీనివాసవర్మ మాట్లాడుతూ తొలుత రూ.50 లక్షలు మంజూరై నట్లు తెలిపారు. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంద న్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, ఏఎంసీ చైర్మన్‌ కోడి విజయ భాస్కర్‌, ఆర్డీవో దాసి రాజు, మునిసిపల్‌ కమిషనర్‌ విజయసారథి పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 12:25 AM