రూట్ మార్చారు!
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:20 AM
గోదావరి తీర ప్రాంత ఇసుకకు ఆంధ్రాతోపాటు తెలంగాణలోను డిమాండ్ పెరిగింది. దీంతో కొందరు ఇసుకాసురులకు ఇసుక అక్రమ రవాణా కాసుల వర్షం కురిపిస్తోంది.
బిల్లుపై అడ్రస్ ఒకటి.. తరలించేది మరోచోటకు
జీలుగుమిల్లి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): గోదావరి తీర ప్రాంత ఇసుకకు ఆంధ్రాతోపాటు తెలంగాణలోను డిమాండ్ పెరిగింది. దీంతో కొందరు ఇసుకాసురులకు ఇసుక అక్రమ రవాణా కాసుల వర్షం కురిపిస్తోంది. పోలీస్ నిఘా కళ్లు కప్పి ఇసుకను తరలిస్తున్నారు. ఆ క్రమంలో కొందరు పోలీసులకు చిక్కడం, వాహన తనిఖీల సమయంలో సరైన పత్రాలు చూపకపోవడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కొవ్వూరు సమీపంలోని ఔరంగాబాద్, ప్రక్కిలంక, తాడిపూడి ప్రాంతాల నుంచి ఇసుక లారీల్లో ఖమ్మం, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మార్గమధ్యలో పోలీసు తనిఖీలకు చిక్కకుండా వయా చింతలపూడి, సీతానగరం గ్రామాల వరకు ఇసుక తరలిస్తున్నట్టు అధికారులకు పత్రాలు చూపుతున్నారు. ఆపై ఆ ప్రాంతాల నుం చి గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించి తెలంగాణకు తరలిస్తున్నారు. జీలుగుమిల్లి, రాచ న్నగూడెం, కామయ్యపాలెం గ్రామాల్లో గతంలో ఏర్పాటు చేసిన ఆంధ్రా తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అవి నిత్యం పోలీసుల పరిశీలనలో ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇసుక తరలిస్తున్నారు. ప్రధానంగా లక్ష్మీపురం, టి.నరసాపురం మీదుగా తెలంగాణకు ఇసుక లారీలు తరలిపోతు న్నాయి. లక్ష్మీపురం నుంచి వయా చింతలపూడి, సీతా నగరం, యర్రగుంట పల్లి తదితర సరిహద్దు సమీప గ్రామాలకు ఇసుక తరలిస్తున్నట్టు బిల్లుల్లో చూపుతున్నారు. దీంతో పోలీసులు తనిఖీల సమయంలో వాటిపై కేసులు నమోదు చేయడం లేదు.ఈ క్రమంలో శనివారం కొవ్వూరు నుంచి వస్తున్న రెండు ఇసుక లారీలను ఎస్‌ఐ వి.క్రాంతికుమార్ లక్ష్మీపురం వద్ద జాతీయ రహదారిపై తనిఖీ చేశారు.తాడువాయి వరకు ఇసుక తరలించేందుకు అనుమతులు ఉన్నాయి. అయితే తాడువాయి దాటి ఆరు కిలో మీటర్లు లక్ష్మీపురం వరకు ఇసుక లారీలు రావ డంతో కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.
ట్రాక్టర్ సీజ్
కుక్కునూరు : సీతారామనగరం గ్రామ పం చాయతీలోని కిన్నెరసాని వాగు నుంచి ఎటువం టి అనుమతులు లేకుండా తెలంగాణ కు అక్ర మంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పట్టు కున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయం లో కిన్నెరసాని వాగు నుంచి తెలంగాణలోని బూర్గంపాడుకు ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందింది. పోలీస్, రెవెన్యూ సిబ్బంది దాడులు జరిపి ట్రాక్టర్‌ను, ట్రైలర్‌ను పట్టుకుని కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కుక్కు నూరు సీఐ రమేశ్‌బాబు ఆదేశాల మేరకు సీజ్ చేసినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు. ఆంధ్రా సరిహద్దు నుంచి ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిరంతరం నిఘా
ఇసుక అక్రమ రవాణా ఆంధ్రా నుం చి తెలంగాణకు వెళ్లేం దుకు వీలు లేకుండా చర్యలు తీసుకుంటు న్నాం. తాటియాకుల గూడెం, కామయ్యపా లెం, రాచన్నగూడెం ప్రాంతాల్లో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఇసుక తరలించే వాహనాలపై అనుమానం వస్తే తనిఖీలు చేస్తున్నాం. వాహనంలో మైనింగ్ పత్రా లు, ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతుందో, సమ యం, వయా రూటులో ఉన్న గ్రామాలు వంటి అంశాలపై పరిశీలిస్తున్నాం. ఇటీవల ఎనిమిది కేసుల్లో పది ఇసుక లారీలు సీజ్ చేశాం.
– వి.క్రాంతికుమార్, ఎస్‌ఐ, జీలుగుమిల్లి