Share News

విర్డ్‌లో రొబోటిక్‌ వైద్య సేవలు

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:37 AM

రొబోటిక్‌ టెక్నాలజీతో విర్డ్‌ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు నిర్వహించారు.

విర్డ్‌లో రొబోటిక్‌ వైద్య సేవలు
ద్వారకాతిరుమల విర్డ్‌ ఆసుపత్రిలో రొబోటిక్‌ సర్జరీ చేస్తున్న వైద్యులు

ద్వారకాతిరుమల, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): రొబోటిక్‌ టెక్నాలజీతో విర్డ్‌ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆసుపత్రిలో ఐదుగురికి రొబోటిక్‌ ఆర్థో శస్త్రచికిత్స ఈనెల 12న డాక్టర్‌ కృష్ణకిరణ్‌ నేతృత్వంలో నిర్వహించినట్లు ట్రస్టు చైర్మన్‌ రాజా ఎస్వీ సుధాకరరావు తెలిపారు. వైద్యులు కృష్ణకిరణ్‌ మాట్లాడుతూ రొబోటిక్‌ టెక్నాలజీతో ఆపరేషన్‌ ద్వారా రోగికి మెరుగైన, కచ్చితమైన, రక్షణతో కూడిన వైద్యం అందుతుందన్నారు. సర్జన్‌ ఆదేశాల మేరకు రోబో పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం వైద్య చికిత్సలను అందించ డంలో రోబో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి, వైద్యులు భవ్యచంద్‌, హమీద్‌, బాలాజీ, పి.నాగేంద్రబాబు, సింధు, రమ్య, మహిత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 12:37 AM