Share News

నలుగురు దొంగలు అరెస్ట్‌

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:00 AM

ఒంటరి వృద్ధులపై దాడిచేసి 40 కాసుల బంగారం, రెండు కేజీల వెండిని దొంగిలించిన కేసులోని నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ చెప్పారు.

నలుగురు దొంగలు అరెస్ట్‌
పోలీసుల అదుపులో నిందితులు, వివరాలు చెబుతున్న ఎస్పీ కిశోర్‌

246 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

ఏలూరు క్రైం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఒంటరి వృద్ధులపై దాడిచేసి 40 కాసుల బంగారం, రెండు కేజీల వెండిని దొంగిలించిన కేసులోని నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ చెప్పారు. ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమా వేశంలో కేసు వివరాలను తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం లక్క వరం గ్రామానికి చెందిన వందనపు లక్ష్మికుమారి(63) ఆమె భర్త ఇంట్లో నిద్రిస్తుండగా ఈనెల 23న తెల్లవారు జామున ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి కర్రలతో కొట్టి 40 కాసుల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండిని అపహరించుకుపోయారు. లక్కవరం పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ రవిచంద్ర పర్యవేక్షణలో సీఐ లు ఎంవీ.సుభాష్‌, క్రాంతికుమార్‌, ఎస్‌ఐ జబీర్‌, ఏఎస్‌ఐ సంపత్‌లతో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ దోపిడీకి పాల్పడిన నలుగురని అరెస్టు చేశారు. లక్కవరం గ్రామానికి చెందిన దేవర శ్రీరామమూర్తి, చెందిన షేక్‌ బాజీ కలిసి బాపట్ల మండలం సువర్టుపురానికి చెందిన అంగడి విల్సన్‌ అలియాస్‌ విల్సన్‌బాబు, అలియాస్‌ లడ్డు, గజ్జెల వాసు, కవాటి ప్రసాద్‌ అలియాస్‌ చిన్న ముఠాతో దోపిడీ చేయించారు. బాజీ పరారు కాగా మిగిలిన నలుగురు పోలీసులకు చిక్కారు. 246 గ్రాముల బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Sep 27 , 2025 | 12:00 AM