రోడ్లు.. కడగండ్లు
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:18 AM
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో గత నెలతో పాటు ఈనెలలో కురిసిన భారీ వర్షాలు రోడ్లకు కడగండ్లును మిగిల్చాయి. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత ఉమ్మడి జిల్లాల్లో భారీగా గోతుల తేలిన రహదారాలను తీర్చిదిద్దారు.
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
వరుస వ ర్షాలతో భారీగా దెబ్బతిన్న రహదారులు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి) :
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో గత నెలతో పాటు ఈనెలలో కురిసిన భారీ వర్షాలు రోడ్లకు కడగండ్లును మిగిల్చాయి. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత ఉమ్మడి జిల్లాల్లో భారీగా గోతుల తేలిన రహదారాలను తీర్చిదిద్దారు. మరికొన్నిచోట్ల మరమ్మతులను చేపట్టారు. ఆగస్టులో సాధారణం కంటే అసాధారణమైన వర్షపాతం నమోదైన కారణంగా రోడ్లకు కోలుకోలేని భారీ నష్టాలు సంభవించాయి. చాలాచోట్ల రోడ్లు అభివృద్ధి చేసిన సమయంలో రోడ్లపై వరదపోటు తీవ్రంగా పడింది. ఈమేరకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా నిధులను కోరుతూ జిల్లా రోడ్లు, భవనాలశాఖ పూర్తిగా ప్రతిపాదన లను సిద్ధం చేసింది. రెండు విధాలుగా యాన్యువల్ మెయింటినెన్స్ గ్రాంట్, మేజర్ డిస్ర్టిక్టు రోడ్లు ్ల(ఎండీఆర్) అభివృద్ధి చేయడానికి భారీగా ప్రతిపాదనలు తయారు చేసి పంపింది. ఇటీవలే ఎండీఆర్ కింద రాష్ర్టానికి ప్రభుత్వం రూ.500 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పంపించిన ప్రతిపాదనలతో రాబోయే కాలంలో ఎండీఆర్ గ్రాంట్ కింద పనులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉండనుంది. ఇది చీఫ్ ఇంజనీర్ స్థాయిలో జరిగే అవకాశం ఉండంతో జిల్లా యంత్రాంగం నిధులు కోరుతూ నివేదికను సమర్పించింది. వీటికి నిధులు యుద్ధ్దప్రాతి పదికన విడుదలయ్యే అవకాశాలున్నట్లు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కె.విజయరత్నం తెలిపారు.
‘పశ్చిమ’లోనూ తీవ్రంగా నష్టం..
పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర రహదారులు 459,79 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ఇందులో వార్షిక నిర్వహణ గ్రాంట్ కింద 111.86 కిలోమీటర్లను 1కోటి56లక్షల39వేల రూపాయలతో మరమ్మతులు చేయడానికి నిర్ణయించారు. అదేవిధంగా భారీగా గోతులు తేలిన రహదారులు 167.8 కిలోమీట్లర బాగు చేతకు 22కోట్ల29లక్షల రూపాయలతోను, మరమ్మతులు చేయడానికి వీల్లేకుండా రోడ్లు ఛిద్రమైన 35.06 కిలోమీటర్ల మేర నూతనంగా రోడ్లు వేయడానికి 44కోట్ల10లక్షల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మేజర్ డిస్ర్టిక్టు రోడ్లు(ఎండీఆర్) కింద 1,108.91 కిలోమీటర్ల మేర రహదారుల వ్యవ స్థలో 222.79 కిలోమీటర్ల వార్షిక నిర్వహణ గ్రాంట్ కింద తక్షణ మరమ్మతులు చేయను న్నారు. దీనికి 1కోటి71లక్షల88 వేలు రూపా యల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. భారీగా గోతులు తేలిన 357.89 కిలోమీటర్లకు మరమ్మతులు చేయడానికి 1కోటి71లక్షల 43వేలు రూపాయలు, పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు 171.43 కిలోమీటర్లు అభివృద్ధి చేయడా నికి 15కోట్ల85లక్షల రూపాయల వ్యయం అవుతుందని అంచ నాలు సిద్ధం చేశారు.
ఏలూరు జిల్లాలో భారీగా తూట్లు
ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు రోడ్లకు కడగండ్లు మిగిల్చాయి. రాష్ట్ర రహదారులు 698.82 కిలో మీటర్లకు గాను 150.14 కిలోమీటర్ల రహదార్లు దెబ్బతినగా, 1కోటి58లక్షల రూపాయలతో వార్షిక నిర్వహణ కింద మరమ్మతులు చేపట్టనున్నారు. 108.93 కిలోమీటర్ల మేర రోడ్లుపై భారీ గోతులు తేలాయి. వీటికి పూర్తి మరమ్మతులు చేయడాకికి 15కోట్ల90 లక్షలు రూపాయలు వెచ్చించనున్నారు. మరమ్మతులకు వీల్లేని విధంగా పాడైన 41.25 కిలోమీటర్ల రోడ్లు బాగుచేతకు 4కోట్ల20లక్షలు రూపాయలు వెచ్చించనున్నారు.
మేజర్ డిస్ర్టిక్టు రోడ్లు పథకం కింద 1,137 కిలోమీటర్ల మేర రోడ్లు దె బ్బతినగా, తక్షణ మరమ్మతుల కోసం 307.04 కిలోమీటర్ల మేర 1కోటి47లక్షల26వేల రూపాయలతో వార్షిక నిర్వహణ గ్రాంట్‌తో బాగు చేయనున్నారు. అదేవిధంగా 147.26 కిలోమీటర్లు మేర భారీ గోతులు తేలిన రహదారుల మరమ్మతులను 14కోట్ల34లక్షల రూపాయలతోను, 233.75 కిలోమీటర్ల 15కోట్ల45లక్షల రూపాయల వ్యయంతో రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.