Share News

వర్షాలతో మరింత అధ్వానం

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:30 AM

రహదారులు గోతులతో అధ్వానంగా ఉన్నాయి. దీనికితోడు వర్షాలతో పూర్తిగా ఛిద్రమయ్యాయి.

వర్షాలతో మరింత అధ్వానం
వర్షంతో ఛిద్రమైన మొగల్తూరు–వెంప ఆర్‌ అండ్‌ బీ రహదారి

అడుగడుగునా గోతులు

తరచు ప్రమాదాలు

వాహనాలకు మరమ్మతులు

నడక కూడా కష్టమే

రహదారులు గోతులతో అధ్వానంగా ఉన్నాయి. దీనికితోడు వర్షాలతో పూర్తిగా ఛిద్రమయ్యాయి. ఆర్‌ అండ్‌ బీ రహదారులపై వాహన రాకపోకలు సాగించడం సాహసమే. గ్రామీణ రహదారులు అడగుగడుగునా గోతులతో అస్తవ్యస్తంగా మారితే పలు గ్రామాల్లోని కాలనీ రహదారులు అసలు అడుగే పెట్టలేని పరిస్థితి. అధిక శాతం రోడ్లు తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతుంటే ఆర్‌ అండ్‌ బీ రోడ్ల నిర్మాణంలో బిల్లుల చెల్లింపులో జాప్యం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం శాపంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో అంతర్గత రహదారులు ప్రమాదాలకు మార్గంగా ఉన్నాయి. తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కుక్కునూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కుక్కు నూరు–భద్రాచలం, కుక్కునూరు – అశ్వారావుపేట ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి మళ్లీ గోతులమయంగా మారింది. రహదారిపై గుంతల్లో వర్షపు నీరు చేరి వాహనాన్ని ముందుకు నడపలేని పరిస్థితి ఏర్పడింది. పదేళ్లుగా ఈ రహదారిపై ప్రజలు నరకం చూశారు. తిరిగి అదే పరిస్థితి నెలకొంది. గతేడాది నుంచి ఈ రహదారి పనులు ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలే దు. పనులు పూర్తయిన చోట మళ్లీ గుంతలు పడ్డాయి. కుక్కునూరు, వేలేరుపాడు ప్రజలు తెలంగాణలోని భద్రాచలం, అశ్వారావుపేట ఇతర ప్రాంతాలకు ఈ ప్రధాన రహదారిపై నిత్యం ప్రయాణిస్తుంటారు. వైసీ పీ హయాంలో అధ్వానంగా మారిన 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి దాదాపు రూ.36 కోట్ల నిధులు మంజూరు చేశారు. కాంట్రాక్టరు 8 కిలోమీటర్లు పను లు చేసిన అనంతరం బిల్లులు రాకపోవడంతో పనులు చేయలేదు. అనంతరం కూటమి ప్రభుత్వం పనులు చేపట్టి సింగిల్‌ లేయర్‌ తారు పనులు పూర్తయ్యాయి. బిల్లు చెల్లింపులో జాప్యంతో సెకండ్‌ లేయర్‌ తారు పనులు జరగలేదు. అధిక వర్షాలతో గోతులు పడ్డాయి. దీనిపై ఆర్‌అండ్‌బీ డీఈ హరికృష్ణ మాట్లాడుతూ బిల్లు చెల్లింపులో జాప్యం వాస్తవమే. నవంబర్‌ నుంచి రహదారి పనులు మొదలవుతాయని తెలిపారు.

నిధులున్నా కదలని పనులు..

మొగల్తూరు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వా లు మారినా రహదారి నిర్మాణానికి మోక్షం లేదు. మొగల్తూరు గాంధీబొమ్మల సెంటర్‌ నుంచి భీమవరం మండలం వెంప గ్రామం వరకూ ఐదు కిలో మీటర్ల ఆర్‌అండ్‌బి రహదారికి 2020 నవంబరులో వైసీపీ ప్రభుత్వం రూ.12.64 కోట్లు మంజూరు చేసింది. మొ గల్తూరు గాంధీబొమ్మల సెంటర్‌ నుంచి వెంప వంతెన వరకూ 5.200 కిలో మీటర్ల రహదారి వెడల్పు చేయ డం, నిర్మాణ పనులు నోచుకోకపోవడంతో శంకుస్థాప నకే పరిమితమైంది. రహదారి పెద్ద గోతులు మారి చినుకు పడితే గోతులు నీటితో నిండి ప్రయాణం నరకంగా మారింది. మొగల్తూరు పంచాయతీ పేట పల్లం, పెద్దగొల్లగూడెం, పడమటిపాలెం, నక్కావారి పాలెం, గోగులమ్మపేట, కొత్తపాలెం గ్రామస్తులతో పా టు మొగల్తూరులోని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్య, వైద్య అవసరాలకు జిల్లా కేంద్రం కోసం భీమవరం వెళ్లడానికి తిప్పలు తప్పడం లేదు.

కాంట్రాక్టు రద్దుకు సిఫారసు

మొగల్తూరు–వెంప రహదారి నిర్మాణం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు పూర్తి చేయకపో వడంతో కాంట్రాక్టు రద్దుచేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్టు ఆర్‌అండ్‌బి అధికారులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన రహదారి నిర్మాణం పూర్తి చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు.

గ్రామీణ రోడ్లు అధ్వానం

ఏలూరు రూరల్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో గ్రామీణ రహదారులు అధ్వానంగా తయార య్యాయి. పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు రూరల్‌ మండలం జాలిపూడి ప్రధాన రహదారి అస్తవ్యస్తమైంది. తారు తుడిచి పెట్టుకు పోయి కంకర తేలింది. గుంతల్లో వర్షపునీరు చేరి ఎక్కడ గుంత ఉందో గుర్తించలేక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేస్తే రాకపోకలకు సౌలభ్యంగా మారుతుందంటున్నారు.

కామవరపుకోట (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షాలకు గ్రామీణ అంతర్గత రహదారులు ఛిద్రమయ్యాయి. రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులను అభివృధ్ది చేయాలని, కనీసం గోతులను పూడ్చాలని గ్రామీన ప్రజలు కోరుతున్నారు.

వర్షం కురిస్తే అడుగు పెట్టలేం

ఆకివీడు రూరల్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): వర్షం కురిస్తే తాళ్లకోడు కాలనీవాసులు అడుగు బయట పెట్టలేని పరిస్థితి. మండలంలోని ఆకివీడు, కుప్పన పూడి, అజ్జమూరు, దుంపగడప, కోళ్లపర్రు, కళింగ పాలెం గ్రామాల ప్రజలకు తాళ్లకోడులోని 74 ఎకరాల్లో ఇంటి స్థలాలు కేటాయించారు. మౌలిక వసతులు కల్పించకుండానే గత ప్రభుత్వం ఒత్తిడితో ఇళ్లు నిర్మించుకునేలా చేసింది. అక్కడ పరిస్థితి దయనీయం గా ఉంది. వర్షం కురిస్తే అడగు బయట పెట్టలేనం తగా రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. వాహ నాలు వెళితే గాడులు పడుతున్నాయి. మురుగునీరు, వర్షం నీరు వెళ్లేందుకు కచ్చా డ్రెయిన్లు కూడా లేకపోవడంతో పరిస్థితి మరింత దుర్భరంగా ఉందని, చీకటి పడితే దోమలు విజృంభిస్తున్నాయని వాపోతు న్నారు. చీకటి పడేలోపు ఇంటికి చేరకుంటే ఎక్కడైనా ఉండిపోవాల్సిందే. ఉపాదిహామీ పధకంతోనైనా కచ్చా డ్రెయిన్లు తవ్వి మురుగునీరు బయటకు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రోడ్లు త్వరితగతిన నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Updated Date - Oct 14 , 2025 | 12:30 AM