రహదారులను బాగు చేయండి
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:30 AM
ఏలూరులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన మం గళవారం జడ్పీ సర్వ సభ్య సమావేశం జరిగింది.
జడ్పీ సర్వసభ్య సమావేశంలో గళమెత్తిన జడ్పీటీసీలు
ధాన్యం సేకరణలో ఇబ్బందులు రానివ్వద్దన్న జడ్పీ చైర్‌పర్సన్ పద్మశ్రీ
రైతుల సమస్యలు తెలుసుకుంటున్నామన్న కలెక్టర్ వెట్రి సెల్వి
ఏలూరు సిటీ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఏలూరులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన మం గళవారం జడ్పీ సర్వ సభ్య సమావేశం జరిగింది. రహదారుల దుస్థితిపై జడ్పీటీసీలు ప్రస్తావించా రు. కొన్ని పాఠశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం సేక రణలో రైతుల సమస్యలను గుర్తించి పరిష్కరిం చాలని చైర్‌పర్సన్ పద్మశ్రీ అధికారులను ఆదేశిం చారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో రికార్డు స్థాయిలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ధేశించారని, ధాన్యం సేక రించిన గంటల వ్యవధిలోనే రైతులకు ధాన్యం సొమ్ము ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. సాగులో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నామని, జిల్లాలో ఇప్పటికే 51 డ్రోన్స్ రైతులకు అందిం చామన్నారు. ఈ–పంట నమోదు నూరుశాతం పూర్తి చేశామన్నారు. రైతులకు నాణ్యమైన గోనె సంచులు అందించేలా అధికారులు చర్యలు తీసు కోవాలన్నారు. 10వ తరగతిలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని, రహదారులపై గుంతలు లేకుం డా చూడాలని, ప్రభుత్వ ఆస్పత్రులలో మెరు గైన వైద్య సేవలు అందించాలన్నారు.
ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లా డుతూ జల్‌జీవన్ మిషన్ పథకం కింద చేపట్టిన పనులు నిర్ధేశించిన సమ యంలోగా పూర్తి చేయాలని, గుంతలు లేని రహదారులు ఉండేలా ఆర్‌అండ్‌బీ అధికారు లు చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీ భవనాలు పూర్తి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ రైతన్నా.. మీకోసం కార్యక్రమం ద్వారా ప్రతి రైతు ఇంటికెళ్ళి వ్యవసాయంలో వారు ఎదు ర్కొనే సమస్యలు, అభిప్రాయాలను యాప్‌లో వ్యవ సాయ అధికారులు పొందుపరు స్తున్నారన్నారు. రాబోయే రబీ, ఖరీఫ్ అనం తరం రబీ సీజన్లకు సంబంధించిన కార్యా చరణ ప్రణాళికలను వ్యవసాయాధి కారులు రూపొందిస్తున్నారన్నారు.
ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో మౌలిక సదుపా యాలపై విద్యాశాఖాధికారులు పర్య వేక్షణ ఉండాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలో సరైన టాయిలెట్లు లేని కారణంగా టాయిలెట్‌కు వెళ్ళాల్సి వస్తుందనే భయంతో విద్యార్థులు నీరు తాగడంలేదని, ఈ కారణంగా వారిలో శారీరక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉంద న్నారు. విద్యాశాఖాధికారులు ప్రైవేట్ పాఠశా లలో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిం చాలన్నారు. తణుకు వద్ద పశుమాంస కబే ళాలు నిర్వహిస్తున్నారని, పర్యావరణానికి ముప్పు కలగటమే గాక ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్య పరిష్కరిచాలన్నారు.
గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంక ట్రాజు మాట్లాడుతూ జడ్పీ నిధుల మంజూ రులో అధిక జనాభా కలిగిన గోపాలపురం నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీట మునిగిన పంటలకు నష్టం కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతుల సంక్షే మంలో ప్రతిపక్ష సభ్యులు రాజకీయం చేయవద్దన్నారు. గత ప్రభుత్వం గోపాల పురం నియోజకవర్గంలో 29వేల 385 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, గత వ్యవసాయ సీజన్‌లో 48 వేల 787 మెట్రిక్‌టన్నుల ధాన్యా న్ని సేకరించామని, గత ప్రభుత్వం రైతులకు ధాన్యం సొమ్ములు అందజేసేందుకు నెలల తరబడి ఆలశ్యం చేస్తే, తమ ప్రభుత్వం గంటల వ్యవధిలోనే సొమ్ము జమచేస్తున్న దన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధు ల్లో సృజనాత్మకత, క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు బాలోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ ఎం. శ్రీహరి, పశ్చిమగోదావరి జిల్లా డీఆర్‌వో బి శివనారాయణ రెడ్డి, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు, జడ్సీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
సాదాసీదాగా స్థాయి సంఘ సమావేశాలు..
ఏలూరు సిటీ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమ గోదావరి 1 నుంచి 7 వరకు జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలు సాదాసీ దాగా జరిగాయి. 2, 4 స్థాయి సంఘాలకు జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీప్రసాద్ అధ్యక్షత వహించగా, 1, 7 స్థాయి సంఘాల సమావేశా లకు జంగారెడ్డిగూడెం, నిడదవోలు జడ్పీటీసీలు పోలినాటి బాబ్జి, కె.సూర్యారావు అధ్యక్షత వహిం చారు. 3, 5, 6 స్థాయి సంఘాల సమావేశాలు కూడా నిర్వహించారు.
ఏలూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు, రోడ్లు దుస్థితి, విద్య, వైద్యం, విద్యుత్ సమస్యల పై జడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించారు. జిల్లాలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు. పంచాయతీల తీర్మానాలు లేకుండా పలు పరిశ్ర మలు గ్రామాల్లో ప్రారంభిస్తున్నారని జంగారెడ్డి గూడెం జడ్పీటీసీ పోలినాటి బాబ్జి అన్నారు. పంచాయతీ పన్నులు గతంలోకన్నా ఎక్కువగా వస్తున్నాయని వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జడ్పీటీసీలు కోరారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, పంచాయతీ శాఖ, డ్వామా, ఆర్‌డబ్ల్యుఎస్, విద్యుత్, విద్యా, ఆరోగ్య, మైనింగ్, పౌరసరఫరాల శాఖలతోపాటు వివిధ శాఖలపై ఈ సమావేశాలలో ప్రధానంగా చర్చించారు. సమావేశాల్లో జడ్పీ సీఈఓ ఎం.శ్రీహరి, డిప్యూటీ సీఈఓ కెభీమేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.