కూల్ డ్రింక్.. గ్లాస్ రూ.50
ABN , Publish Date - May 30 , 2025 | 12:03 AM
సినిమా థియేటర్లలో సౌకర్యాలు, ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ ధరలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఏలూరులో ఒక థియేటర్‌లో కూల్ డ్రింక్ 300 మి.లీ. గ్లాస్ రూ.50 ధర ఉండడంతో అధికారులు నోరెళ్ల బెట్టారు.
సినిమా థియేటర్లలో సౌకర్యాలపై అధికారుల తనిఖీ
పారిశుధ్యం నిర్వహణ.. ఆహార పదార్థాల ధరలపై ఆరా
సినిమా థియేటర్లలో సౌకర్యాలు, ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ ధరలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఏలూరులో ఒక థియేటర్‌లో కూల్ డ్రింక్ 300 మి.లీ. గ్లాస్ రూ.50 ధర ఉండడంతో అధికారులు నోరెళ్ల బెట్టారు. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేదని గుర్తించారు. నిబంధనలు పాటించి వసతులు సక్రమంగా అమలు చేయాలని థియేటర్ యాజమాన్యాలను ఆదేశించారు.
ఏలూరు, మే 29 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా రెవెన్యూ అధికారులు సినిమా థియేటర్లలో గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి సూచనలతో ఏలూరు నగరంతో పాటు జిల్లాలో సుమారు 45 ఽఽథియేటర్లకు 32 థియేటర్లను తనిఖీ చేశారు. నగరంలో అంబికా ఽథియేటర్ స్ర్కీన్లను ఆర్డీవో అంబరీష్, తహసీల్దార్ జీవీ సత్యనారాయణ తనిఖీ చేశారు. సత్యనారాయణ థియేటర్‌లో 300 మిల్లి లీటర్లు కూల్ డ్రింక్ రూ.50 ధరకు అమ్మడంపై తహసీల్దార్ జీవీ.శేషగిరిరావు ప్రశ్నించారు. మిగతా చోట్ల రూ.40కే అమ్ముతున్నట్లు గుర్తించారు. అంబికా థియేటర్‌లో ఉదయం వేళ మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడాన్ని గుర్తించి సూచనలు ఇచ్చారు. బాలాజీ కాంప్లెక్సులో సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. లైసెన్సుల రెన్యువల్, టిక్కెట్ల రేట్లు, తినుబండారాలు, మరుగుదొడ్ల నిర్వహణ, సీటింగ్ కెపాసిటి, పార్కింగ్ వసతులపై అధికారులు ఆరా తీశారు. తినుబండారాల వినియోగంలో నాణ్యత పాటించడంతో పాటు, మంచినీరు, ఇతర వసతులను పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కైకలూరు పట్టణంలోని విజయలక్ష్మి, మాగంటి, వెంకట రమణ థియేటర్ల తనిఖీ చేపట్టారు. పోలవరంలో గంగా భవాని ధియేటర్‌లో వసతులు సంతృప్తిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. చింతలపూడిలోని మూడు మల్టీ ప్లెక్స్ కాంప్లెక్‌తో పాటు ఒక థియేటర్‌లో తహసీల్దార్ ప్రమ ద్వర, అధికారులు తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, క్యాంటీన్‌లలో స్నాక్స్, డ్రింక్స్ ధరలను పరిశీలించారు. భీమడోలులో శ్రీనివాస్ థియేటర్ వసతులపై తహసీల్దార్ సంతృప్తి వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీరాజ రాజేశ్వరి, శ్రీలక్ష్మి థియేటర్లలో తహసీల్దార్ స్లీవజోజి తనిఖీ చేపట్టారు. ఫైర్ స్టేఫ్టీ యంత్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్యాంటీ న్లలో తినుబండారాలు ఎక్కువ రేట్లకు అమ్మవద్దని సూచించారు. షో పూర్తయిన తర్వాత టాయిలెట్లను క్లీన్ చేయాలని యాజమా న్యాలకు తెలిపారు. నూజివీడు పట్టణంలో ఒక థియేటర్ యాజమాన్యానికి నోటీసు జారీ చేశారు.