ప్రజా సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:23 AM
ప్రజా సమస్యల పరిష్కార వేది కలో అందజేసిన అర్జీలను తక్షణం పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
ప్రజల నుంచి 367 అర్జీల స్వీకరణ
భీమవరంటౌన్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేది కలో అందజేసిన అర్జీలను తక్షణం పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణి, జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఎన్నికల కోడ్ కారణంగా నెల రోజులుగా పరిష్కార వేదిక నిలుపు దల చేయడంతో సోమవారం అర్జీదారులు అధిక సంఖ్యలో కలెక్టరేట్‌కు తరలివ చ్చారు. అర్జీలను పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. తహసీల్దార్లు ప్రతి అర్జీ పరిశీలించి ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. ఆర్డీవోలు వారి పరిధిలో పర్యటించి ఎండార్స్‌మెంట్లను పరిశీలిం చాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కారం చేయాల న్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు 367 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, సచివాలయాల జిల్లా ఇన్‌చార్జి వై.దోసిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అర్జీలు అందజేసిన వారిలో కొన్ని సమస్యలు..
కొవ్వాడ అన్నవరం గ్రామానికి చెందిన అలమండ్ర ఏసుమణి దంపతులు ఇద్దరూ దివ్యాంగులు. గొంతులో కణితి ఉందని, డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య కార్డును మంజూరు చేయాలని ఏసుమణి కోరారు.
ఆకివీడు అమృత రావు కాలనీ శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందని, అధికారులు చర్యలు తీసుకోవాలని శాల భాస్కరరావు ఫిర్యాదు చేశారు.
తన కుమార్తె కస్తూరి కృష్ణవేణి తనను మోసం చేసి వేలిముద్రలు తీసుకుని ఆస్తి రాయించుకుందని తుందుర్రుకు చెందిన ఆకుల వెంకటేశ్వరరావు ఫిర్యా దు చేశారు. వృద్ధాప్యంలో తనను చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వేల్పూరులో ఒంటరిగా నివశిస్తున్న మూగవాడు కొట్టి శ్రీనివాసరావు పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశాడు.
గ్రామ పంచాయతీ ఉద్యోగి మోసం చేసి తమ వేలిముద్రలు తీసుకుని తమ భూమిని వేరొకరికి రాయించేశారని యలమంచిలి మండలం ఏనుగువానిలంక పంచాయితీ పోలవరానికి చెందిన ఇంజమూరి పుల్లయ్య ఫిర్యాదు చేశారు. పంచాయితీ గుమస్తా సుబ్బారావుపై చర్యలు తీసుకుని తమ భూమి తమకు అప్పగించాలని కోరాడు.