అర్జీలను సకాలంలో పరిష్కరించండి
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:41 PM
అర్జీదారుల సమస్యలను నిర్దేశించిన గడువులోపు వారు సంతృప్తి చెందేవిధంగా పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
భీమవరం టౌన్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): అర్జీదారుల సమస్యలను నిర్దేశించిన గడువులోపు వారు సంతృప్తి చెందేవిధంగా పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ నాగరాణి, జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డి అర్జీలను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి 221 అర్జీలను స్వీకరించారు. తమ శాఖ పరిధిలో లేని ఫిర్యా దులు వస్తే వాటిని తక్షణమే సంబంధిత శాఖ అధికారులకు పంపించా లన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యల పరిష్కారం ఉండాల న్నారు. డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడి కేసీహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరావు అర్జీలు స్వీకరించారు.
ప్రజా సమస్యలపై పూర్తిస్థాయి విచారణ : ఏఎస్పీ
భీమవరం క్రైం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏఎస్పీ వి.భీమారావు నిర్వహించారు. ప్రజల నుంచి ఏఎస్పీ అర్జీలను స్వీకరించి సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అర్జీదారుల సమస్యలను చట్టపరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. మొత్తం 21 అర్జీలను ఏఎస్పీ స్వీకరించారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది పాలొన్నారు.