ప్రతి అర్జీకి ఆడిటింగ్
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:37 AM
‘ప్రజల నుంచి అందే ప్రతి అర్జీ ఆడిటింగ్ జరుగుతుంది. వాటిని నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి’ అని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
భీమవరం టౌన్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ‘ప్రజల నుంచి అందే ప్రతి అర్జీ ఆడిటింగ్ జరుగుతుంది. వాటిని నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి’ అని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ ఎస్)లో అర్జీలను స్వీకరించి మాట్లాడారు. అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షిస్తామని, అర్జీలు రీ–ఓపెన్ అయితే వాటికి గల కారణాలను వివరించాలన్నారు. వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ఆన్‌లైన్‌తోపాటు తప్పనిసరిగా డైరీలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ వారం 274 అర్జీలు వచ్చాయి. వాటిలో కొన్ని..
నర్సయ్య అగ్రహారం పార్కు వీధిలో సరైన డ్రెయిన్, రోడ్డు లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోతోందని, ఈ కారణంగా దోమలు బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. రోడ్డు, డ్రెయిన్ సదుపాయం కల్పించాలని కోరారు. తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని అత్తిలి మండలం ఈడూరుకు చెందిన ఘంట సాయిబాబు కోరారు. తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తనను, తన బిడ్డను అత్తింటి వారు గెంటేశారని, తిరిగి వారింటిలోనే తమకు ఆశ్రయం కల్పించాలని గణపవరం మండలం చిలకంపాడుకు చెందిన బొడ్డుపల్లి దుర్గాభవాని కోరారు. ఉణుదు ర్రు ఎస్సీ పేటలోని ఆక్రమణల కారణంగా పంచా యతీ చెరువు నీరు కలుషితమై పశువులు కూడా తాగడానికి పనికిరాకుండా పోయాయని ఉండి మం డలం ఉనుదుర్రుకు చెందిన న్యాయవాది గొర్రు ముచ్చు సుందరకుమార్ ఫిర్యాదుచేశారు. ఆక్రమణ లు తొలగించి, వ్యర్థాల పైపులను కాలువలో పెట్ట కుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు శేరే పాలెంలో వున్న 42 సెంట్లభూమిని ఆన్‌లైన్ చేయ మని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని మొగల్తూరు మండలం కొత్తపాలెంకు చెందిన చెన్ను వరలక్ష్మి ఫిర్యాదు చేశారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వరరావు, సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.