Share News

అర్జీలను వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:25 AM

పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రి రెడ్డి అధికారులను ఆదేశించారు.

అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కలెక్టరేట్‌ వద్ద షెడ్‌లో ప్రజల అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు

ఏలూరు రూరల్‌/టౌన్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రి రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 376 అర్జీలను స్వీకరించారు. జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ సమస్యలపై నాణ్యమైన పరి ష్కారాన్ని అందించాలన్నారు. నిబంధనల మేరకు ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే దరఖాస్తుదారులకు కారణాలను తెలియజేయాలన్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, సీఈవో శ్రీహరి, డీఆర్‌డీఏ పీడీ ఆర్‌.విజయరాజు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు కె.భాస్కర్‌, దేవకీదేవి వినతులు స్వీకరించారు.

కలెక్టరేట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌

కలెక్టరేట్‌లో అధికారులు అర్జీలు స్వీకరిస్తున్న సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు రేగాయి. జేసీ ధాత్రిరెడ్డి విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే సరిచేసి సరఫరా పునరుద్ధరించారు. దీనితో కొద్దిసేపు కలెక్టరేట్‌ బయట షెడ్‌లో అర్జీలు స్వీకరించారు.

Updated Date - Jun 17 , 2025 | 12:25 AM