వినతులు సకాలంలో పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:27 AM
పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతులు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు.
కలెక్టర్ నాగరాణి..అర్జీల స్వీకరణ
భీమవరంటౌన్, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతులు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల ప్రజా వేదిక కార్యక్ర మానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 192 అర్జీలు స్వీకరిం చారు. కలెక్టర్‌తో పాటు జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పీడీ డా.కేసీహెచ్ అప్పారావు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, కలెక్టరేట్ ఏవో ఎన్.వెంకటేశ్వర్లు ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యల పరిష్కారం చేయడంలో అధికారులు మరింత శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు.
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు : ఎస్పీ
భీమవరం క్రైం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్యుల సమస్యల పట్ల స్పందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 11 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో పోలీస్ శాఖను ఆశ్రయిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఎస్పీ స్వయంగా ఫోన్‌లో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, ఇతర కార్యాలయ పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.