Share News

రెవె‘న్యూ’ క్లినిక్‌

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:38 PM

భూముల లెక్కల్లో ఏ చిన్న సమస్య పరిష్కారం కావాలన్నా ఆ ఫైల్‌ వివిధ దశల్లో వీఆర్వో నుంచి కలెక్టర్‌ వరకు వెళుతుంది.

రెవె‘న్యూ’ క్లినిక్‌
రెవెన్యూ క్లినిక్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌, జేసీ

భూ సమస్యల పరిష్కారానికి ఓ వేదిక

ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం అవుతాయని రైతుల హర్షం

సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు

పాలకోడేరు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): భూముల లెక్కల్లో ఏ చిన్న సమస్య పరిష్కారం కావాలన్నా ఆ ఫైల్‌ వివిధ దశల్లో వీఆర్వో నుంచి కలెక్టర్‌ వరకు వెళుతుంది. కాని, ఇది పరిష్కార మయ్యేందుకు ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరి గినా, చేతి చమురు వదిలించుకున్నా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఆ సమస్య వుంటుంది. అటువంటి రైతుల భూసమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు ముందుచూపుతో రెవె న్యూ క్లినిక్‌ల కాన్సెఫ్ట్‌ను తీసుకువచ్చారు. ఇవి సోమవారం నుంచి జిల్లాలో ప్రారంభమైంది. కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేశారు. మ్యుటేషన్‌ సమస్యలు, ఆస్తిలో పొరపాట్లు, డి–ఫారం పట్టాల సమస్యలు, పొలం కొలతల్లో తేడా, మాగాణి సమస్య.. ఇలా ఎన్నో రైతులను ఇబ్బందులపై అర్జీలు వచ్చాయి. కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఆర్వోఆర్‌, పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆర్వో ఎఫ్‌ఆర్‌, 1/70 సంబంధించినవి, రీ సర్వే, ఇలా మొత్తం 14 రకాల సమస్యలను అర్జీలుగా విభ జించారు. వాటికి అనుగుణంగా ఏ సమస్య ఏ విభాగానికి చెందినదో గుర్తించి అర్జీదారుల్ని ఆ టేబుల్‌ వద్దకే పంపించారు. ఏయే సమస్యలను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామన్నది దరఖాస్తుదా రుడికి తెలియజేశారు.

20 మండలాలు.. 318 గ్రామాలు

జిల్లాలోని 20 మండలాలు, 318 గ్రామాల్లో ఏదో ఒక మూల ఏదో రైతుకు పంట పొలాల సమస్య తలనొప్పిగా ఉంది. వీటి పరిష్కారానికి గ్రామ రెవెన్యూ క్లినిక్‌లలో వీఆర్‌ఏ, వీఆర్వో, ఆర్‌ఐ, ఎమ్మార్వో, సర్వేయర్‌, స్పెషల్‌ ఆఫీసర్‌, ఆపై ఆర్డీవో రైతుల సమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించే విధంగా గ్రామ రెవెన్యూ క్లినిక్‌లు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలను పరిష్కరించేందుకే ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌ను నిర్వహిస్తూ వస్తోంది. వాటిలో సమస్యలు పేరుకుపోవడంతోనే సీఎం వాటికి చెక్‌ పెట్టేందుకే రెవెన్యూ క్లినిక్‌లు గ్రామాల్లో ఏర్పాటు చేశా రు. దీనిపై పలువురు రైతుల మాటల్లో.. ‘భూముల సమస్య పరిష్కారం రైతుల కు అందని ద్రాక్షగా మిగులుతోంది. వారితో పనిచేయించుకోవడం చాలా శ్రమతో కూడుకున్నది. రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటికైనా ఏళ్ల తరబడి రైతుల సమస్యలు పరిష్కారమవ్వాలి’ అని కోరుకొల్లుకు చెందిన గాదిరాజు శ్రీనివాసరాజు అన్నారు. ‘రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుచూపుతో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లు ఎంతో మేలు చేస్తాయి’ అని వేండ్రకు చెందిన పాలా వెంకట చలపతి తెలిపారు.

కలెక్టరేట్‌లో 59 అర్జీల స్వీకరణ

భీమవరంటౌన్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం రెవెన్యూ క్లినిక్‌ ప్రారంభమైంది. కలెక్టర్‌ సీహెచ్‌ నాగ రాణి దీనిని ప్రారంభించి 59 రెవెన్యూ అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్‌లో మొత్తం ఐదు కౌం టర్లు ఏర్పాటుచేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్‌ ద్వారా రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని చెప్పా రు. ప్రజలందరూ వీటిని వినియోగించుకోవా లని కోరారు. రీ సర్వేలో తన కుటుంబ సభ్యు ల పేరు మీద మొత్తం 21 సెంట్ల భూమి తగ్గిందని పెదమామిడిపల్లికి చెందిన వర్ధి నీడి ధనవెంకటనాగేశ్‌, తన భార్య పేరిట వున్న భూమి లెక్కల్లో తేడా చూపుతున్నారని, వీటిని సరిచేయాలని ఆకివీడు మండలం పెదకాపవరానికి చెందిన దాట్ల రంగరాజు అర్జీలు సమర్పించారు. వీటిని పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - Dec 29 , 2025 | 11:38 PM