Share News

పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై శ్రద్ధ పెట్టాలి

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:20 AM

పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరి ష్కారంపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ నాగరాణి ఆదేశించారు.

పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై శ్రద్ధ పెట్టాలి
ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ నాగరాణి

భీమవరం టౌన్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరి ష్కారంపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 210 అర్జీలు అందుకున్నారు. వాటిలో కొన్ని.. పుట్టుకతోనే మానసిక, శారీరక వికలాంగుడైన తన కుమారుడికి రూ.15 వేల పింఛను మంజూరు చేయా లని కాళ్ల మండలం మండలం, పెద అమిరానికి చెందిన తాళ్లపూడి గోవింద కోరారు. 30 సెంట్ల తన భూమిని ఆన్‌లైన్‌ చేసి పాస్‌బుక్‌ ఇప్పించాలని వీరవాసరం మండలం మత్స్యపురికి చెందిన సాయి బుజ్జిబాబు కోరారు. క్యాన్సర్‌కు ఆపరేషన్‌ చేయించుకోవడంతో ఏపని చేయలేని స్థితిలో వున్న తనకు పింఛన్‌ మంజూరు చేయాలని భీమవరానికి చెందిన బావిశెట్టి వీర వెంకట సత్యనారాయణ కోరారు. తన కుమారుడు మోసం చేసి తాను వుం టున్న ఇంటిని రాయించుకున్నట్లు భీమవరం మండలం రాయలం నివాసి మానుకొండ సంపూర్ణమ్మ ఫిర్యాదు చేశారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ డాక్టర్‌ కేసీహెచ్‌ అప్పారావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు ఫిర్యాదులు స్వీకరించారు.

అర్జీలు పునరావృతం కాకూడదు : ఎస్పీ

భీమవరం క్రైం: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అర్జీలు పునరావృతం కాకుండా గడువులోగా శాశ్వ త పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. కుటుంబకలహాలు, సైబర్‌ మోసాలు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్‌ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఆస్తి తగాదాలు, ఇతర సమస్యలపై మొత్తం 15 అర్జీలను ఎస్పీ స్వీకరించారు. ఏఎస్పీ(అడ్మిన్‌) వి.భీమారావు, జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ దేశంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 12:20 AM