Share News

రెవెన్యూ క్లినిక్‌లకు అనూహ్య స్పందన

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:00 AM

రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరిం చేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు అను సంధానంగా రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ప్రత్యేకంగా రెవె న్యూ సమస్యలపై అర్జీల స్వీకరణ సోమవారం ప్రారంభ మైంది.

రెవెన్యూ క్లినిక్‌లకు అనూహ్య స్పందన
రెవెన్యూ క్లినిక్‌ వద్ద అర్జీలు సరిచూస్తున్న అధికారులు

ఏలూరులో 38–జంగారెడ్డిగూడెం–20 నూజివీడు– 7 అర్జీలు స్వీకరణ

ఏలూరు,డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరిం చేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు అను సంధానంగా రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ప్రత్యేకంగా రెవె న్యూ సమస్యలపై అర్జీల స్వీకరణ సోమవారం ప్రారంభ మైంది. కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరం వేదిక గా ఆర్డీవో అచ్యుత్‌ అంబరీష్‌ అర్జీలను స్వీకరించారు. దీనికి ముందుగా రిసెప్షన్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ లోని వివిధ సెక్షన్ల అధికారులు నాంచారయ్య, శేషగిరిరావు, రవి కుమార్‌, చెల్లన్న దొర పర్యవేక్షణలో అర్జీలను పరిశీలించి సక్రమంగా ఉంటే ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఆర్డీవో వద్దకు అర్జీదారులను పంపారు. ఆధార్‌ సమస్యలు తలెత్తిన వారికి ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ చేయిం చడానికి ఐరిష్‌ యంత్రంతో పాటు సిబ్బందిని నియమించారు. నూజివీడు సబ్‌ కలెక్టరేట్‌, జంగా రెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయా లతో పాటు జిల్లాలో 27 తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేసి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చిన వారికి భోజన ఏర్పాట్లను చేశారు. ఇక ప్రతీ వారం రెవెన్యూ క్లినిక్‌ల నిర్వహణ ఉంటుందని అఽధికారులు చెబుతున్నారు. ఏలూరు ఆర్డీవో పరిధిలో 30, జంగారెడ్డిగూడెం ఆర్డీవో పరిధిలో 20, నూజివీడు సబ్‌ కలెక్టరేట్‌ పరిధిలో ఏడు అర్జీలు వచ్చాయి. ప్రత్యేకించి రెవెన్యూ సమస్యలపై అర్జీల స్వీకరణ వల్ల త్వరితగతిన పరిష్కార మయ్యే అవకాశాలున్నాయి.

Updated Date - Dec 30 , 2025 | 12:00 AM