Share News

నేటి నుంచి రెవెన్యూ క్లినిక్‌లు

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:01 AM

రెవెన్యూ అర్జీలను వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం సంస్కరణ లకు తెరతీసింది.

నేటి నుంచి రెవెన్యూ క్లినిక్‌లు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

రెవెన్యూ అర్జీలను వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం సంస్కరణ లకు తెరతీసింది. పీజీఆర్‌ఎస్‌లోనే వినతులను తీసు కుంటున్న.. ప్రజల సంతృప్తి పరి చే స్థాయిలో అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ఇటీవల మన్యం జిల్లాలో అమలు చేసిన విధంగా ప్రతీ జిల్లాలో రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహించాలని ప్రభు త్వం ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఇప్పటికే అమలవుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)కు అనుబంధంగా రెవెన్యూ క్లినిక్‌లను ఈనెల 29 నుంచి సోమవారం నుంచి అమలు చేయాలని రాష్ట్ర భూపరిపాలన కమిషనర్‌ (సీసీ ఎల్‌ఏ) జి.జయ లక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఈనెల 26నే అధికారు లకు అందాయి. దీంతో శరవేగంగా ఏర్పా ట్లు చేస్తున్నారు. కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీ ల్దార్‌ కార్యాలయాల వద్ద ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేస్తారు. జిల్లాలోని 27 తహసీ ల్దార్‌ కార్యాలయాల వద్ద ప్రజల సమస్యలను స్వీకరించడానికి నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. టేబుల్‌–1 దరఖాస్తు ఫారం అందజేత, టేబుల్‌ –2 వద్ద అర్జీ రాయించడం, టేబుల్‌–3 వద్ద ఆన్‌లైన్‌లో నమోదు, టేబుల్‌–4 వద్ద తహసీల్దార్‌ స్వీకరణ జరిగే ఏర్పాట్లు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఇరుకుగా ఉన్న చోట్ల బయట టెంట్లు వేసి, కుర్చీలు వేసి అర్జీలు తీసుకోవడానికి ఏర్పా ట్లు చేశారు. అన్నీచోట్ల ఉదయం 10 గంటల నుంచి ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి.

సమస్యల విభజన.. కౌంటర్లు

కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఆర్వోఆర్‌, పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆర్వో ఎఫ్‌ఆర్‌, 1/70 సంబంధించినవి, రీ సర్వే, ఇలా మొత్తం 14 రకాల సమస్యలను అర్జీలుగా విభజించాలి. వాటికి అను గుణంగా ఏ సమస్య ఏ విభాగానికి చెంది నదో గుర్తించి అర్జీదారుల్ని ఆ టేబుల్‌ వద్దకే పంపాలి. ఆర్వోఆర్‌ కేసుల్లో అప్పీలు అవస రమైతే.. తహసీల్దారు, సబ్‌ కలెక్టర్‌ స్పందిం చాలి. దీంతో జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు కూడా జిల్లా కేంద్రంలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించే రోజున అందుబాటులో ఉండాల్సిందే. ఏయే సమస్యలను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామన్నది దరఖాస్తుదారుడికి తెలపాలి. దరఖాస్తు స్వీకరించినందుకు రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ రోజు సాయంత్రం ఆర్డీవో, జేసీలు రెవెన్యూ అర్జీలపై సమీక్షించి, దిశా నిర్దేశం చేయనున్నారు.

సిబ్బందిని పెంచుతారా?

జిల్లా కేంద్రంలో గోదావరి సమావేశ మందిరంలో పీజీఆర్‌ఆఎస్‌ కింద వినతులను కలెక్టర్‌ ఆధ్వర్యంలో అధికారుల బృందం స్వీకరిస్తోంది. రెవెన్యూ సమస్యలపై ఇప్పటికే 14 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఈ సంఖ్యను పెంచుతారా? లేదా ఉన్నవారికే స్వీకరణ సందర్భంలోనే బాధ్యతలు పెంచుతారా అన్నది సోమవారం నిర్వహించే వరకు వేచి ఉండాల్సిందే.

Updated Date - Dec 29 , 2025 | 12:01 AM