Share News

రెవె న్యూ!

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:56 AM

రెవెన్యూలో సరికొత్త ప్రయోగాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా యంత్రాంగం వివిధ సమస్యలను పరిష్కరిస్తున్నా.. ప్రజల్లో సరైన సంతృప్తి కానరావడం లేదు.

రెవె న్యూ!

సమస్యలపై ప్రజల్లో సంతృప్తి 64 శాతమే

ప్రక్షాళన దిశగా యంత్రాంగం అడుగులు

రెవెన్యూలో సరికొత్త ప్రయోగాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా యంత్రాంగం వివిధ సమస్యలను పరిష్కరిస్తున్నా.. ప్రజల్లో సరైన సంతృప్తి కానరావడం లేదు. దీంతో మెరుగైన పాలనా విభాగం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వివిధ భూములకు సంబంధించి చాలా సమస్యలు జిల్లా యంత్రాంగం వద్ద పెండింగ్‌లో ఉండడంతో ఈ విధానం లో సమూల మార్పుల దిశగా ప్రక్షాళను ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

అమరావతిలో ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సు లోనే సీఎం చంద్రబాబు రెవెన్యూ శాఖ పనితీరు బాగానే ఉందని చెబుతూనే ఇంకా బెస్ట్‌ ప్రాక్టీస్‌లు చేయాల్సి ఉందంటూ చురకలు వేశారు. ఏలూరు జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ప్రజల సంతృప్తి స్థాయి 64 శాతం మేర ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూలో మరిన్ని సంస్కరణలు చేస్తూ త్వరలో జీవో వెలువడుతుందని చెబుతున్నారు. కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్‌లో కలెక్టర్‌ లాగిన్‌లో ఉండడం వల్ల సమస్యలు పరిష్కారం జరగడం లేదని ప్రభుత్వం గుర్తించింది. వివిధ ప్రాజెక్టుల భూసేకరణ, నష్ట పరిహారాల పంపిణీలో ఇబ్బందులున్నాయి. చాలావరకు రెవెన్యూ అంశాలకు సంబంధించి సెటిల్‌మెంట్‌ అధికారిగా జాయింట్‌ కలెక్టరే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన ఉన్న అలా జరగడం లేదు. క్షేత్రస్థాయిలోనూ ఇబ్బం దులు తలెత్తుతున్నా యి. చాలావరకు కిందిస్థాయిలోనే సమస్యలను పరి ష్కరించే దిశగానే కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్ల నుంచి కొన్ని అధికారా లను కింది స్థాయికి బదలాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇటీవల భూముల వివాదాల అప్పీళ్ల విషయంలో ఆర్వో ఆర్‌ యాక్టు(రికార్డు ఆఫ్‌ రైట్స్‌) అధికారాలను డీఆర్వో నుంచి ఆర్డీవోలకు బదలా యించారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ విధానం అమలు చేయగా, కొద్ది నెలుల క్రితమే కూటమి ప్రభుత్వం మార్పు చేసింది.

తహసీల్దార్లకు అడంగళ్‌ పర్యవేక్షణ

రెవెన్యూలో అతి కీలకమైన అడంగళ్‌ల్లో తప్పు లు, మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే చాలా కష్టం సాఽధ్యంగా ఉంటుంది. ఇప్పటి వరకు అడం గళ్‌లో మార్పులు, ఇతర తప్పుల సవరణకు కింద స్థాయిలో తహసీల్దార్లు పర్యవేక్షించి జాయింట్‌ కలెక్టర్‌ లాగిన్‌లో ఉంచితే వాటిని సరిచూసి ఒకే అయితే మార్పులు చేసేవారు. ఈ విధానం వల్ల జాప్యం జరుగుతుండటంతో ఇక మీదట తప్పి దాలు, పొరపాట్ల పర్యవేక్షణను జేసీల నుంచి తహ సీల్దార్లు అడంగళ్‌ సరిచూసే బాధ్యతలను అప్ప గించే అవకాశం ఉంది.

22ఏ బాధ్యత ఆర్డీవోలకే?

22ఏ నిషేధిత భూముల పరిష్కారంలో ప్రభుత్వం స్పీడ్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టనుంది. ఈ భూముల సమస్యలను పరిష్క రించేందుకు వీలుగా కలెక్టర్‌ చైర్మన్‌, జేసీ, డీఆర్వో, ఏడీ సర్వే, ఆర్డీవో, తహసీల్దార్లు సభ్యులుగా కమిటీ ఉంది. దీనివల్ల జాప్యం చోటు చేసుకుంటోందని గుర్తించిన ప్రభుత్వం ఆర్డీవోల స్థాయిలో 22ఏ భూములపై పరిష్కారాలను చూపేలా అధికారాలను బదలాయించే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:56 AM