అర్ధరాత్రి చిందులు
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:56 AM
జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో అతిథి గృహాల వేది కగా రేవ్ పార్టీలు జోరందుకున్నాయి. యువతను ఆకర్షిం చేందుకు ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి అర్ధరాత్రి చిందులు వేస్తున్నారు.
అమ్మాయిలతో డ్యాన్స్‌లు.. పోలీసుల దాడులు
అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో అతిథి గృహాల వేది కగా రేవ్ పార్టీలు జోరందుకున్నాయి. యువతను ఆకర్షిం చేందుకు ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి అర్ధరాత్రి చిందులు వేస్తున్నారు. కొంత కాలంగా ఇటు వంటి పార్టీలు సాగుతున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో ని తోటల్లో ఎన్నో అతిథి గృహాలు వున్నాయి. ఇవి ప్రకృతి అందాలతోపాటు చల్లదనంతో అలరారుతుంటాయి. వీటి ల్లో సేద తీరేందుకు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి అతిథి గృహాల్లో కొన్ని క్యాబరే డ్యాన్స్‌లకు కేరాఫ్‌గా మారుతున్నాయి. నెల క్రితం ఓ వర్గానికి చెందిన యువకులు యువతులను రప్పించి చిందులు వేశారు. పోలీసులు వెళ్లి అడ్డుకుంటే అధికార పార్టీకి చెందిన ఓ నేత ఫోన్ చేయడంతో వదిలి వెళ్లిపో యారు !. ఇది తెలుసుకున్న మరో వర్గం తర్వాత రేవ్ పార్టీ పెట్టి చిందులు వేసింది. ఇది తెలిసి అధికారులు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారు ఎదురు తిరిగి మొన్న వేరే వారిని విడిచిపెట్టారు కదా..! అంటూ రుసరుసలాడారు. దీంతో వారు ఏమీ చేయలేక వెనుదిరిగి నట్లు సమాచారం. ఇలా తీర ప్రాంతంలో రెండు వర్గాల కు చెందిన యువకులు అర్ధరాత్రి పార్టీల్లో పోటీ పడ్డారు. ఈ పార్టీలో అధికార మండల పార్టీ అధ్యక్షుడు భాగస్వా మి అవుతుండడంతో గుట్టుచప్పుడు కాకుండా క్లబ్ డ్యాన్స్ లు వేస్తున్నారు. ఓ వర్గం యువకులకు నియోజకవర్గంలో అధికారాన్ని చెలాయించే నేత అండ ఉంది. దీనిని ఆసరా గా చేసుకుని కొందరు యువకులు సరాదాలకు, జల్సాలకు పోతున్నారు. ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాటలు జోరుగా సాగేవి. వీటిపై ప్రభుత్వం సీరియస్ కావడంతో అవి కొంత వరకు కట్టడి అయ్యాయి. తాజాగా తీర ప్రాంతంలోని ప్రైవేటు అతిథి గృహాలు రేవ్ పార్టీలకు వేదికలుగా మారడంతో పెద్ద చర్చే నడుస్తోంది.