గురుకుల కళాశాల విద్యార్థిని మృతి
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:19 AM
పోలసానపల్లి బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథ మ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది.
మృతిపై అనుమానాలు
బంధువుల ఆందోళన
భీమడోలు, జూలై 10(ఆంధ్రజ్యోతి): పోలసానపల్లి బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథ మ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. కళాశాలలో గురువారం మధ్యా హ్నం 3.30 గంటల వరకూ మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ అనంతరం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. భీమడోలు శివారు అర్జావారిగూడెం గ్రామా నికి చెందిన లేళ్ల మానస (16) అప్పటి వరకు తల్లి దండ్రులు మరియమ్మ రాజుతో ఉల్లాసంగా సమావేశం లో ఉందని చెబుతున్నారు. తర్వాత కొద్దిసేపటికే మృతి చెందినట్లు తెలియడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. చున్నీతో ఉరివేసుకుని మృతి చెందినట్లుగా కళాశాల అధికారులు చెబుతుండగా తల్లిదండ్రులు, బంధువులు ఖండిస్తున్నారు. పాఠశాల అధికారులు, అధ్యాపకులు ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. మానస అపస్మారక స్థితిలో ఉండడంతో కళాశాల యాజమాన్యం మానసను భీమడోలు ప్రభుత్వ సామాజిక వైద్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
గురుకుల కళాశాల విద్యార్థిని మానస మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమతో ఉల్లాసంగా గడిపిన కుమార్తె అంతలోనే ఎలా చనిపోతుందని తల్లి దండ్రులు, బంధువులు ప్రశ్నిస్తున్నారు. మృతిపై అను మానాలు వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలం టూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు.
పోలసానపల్లి గురుకుల కళాశాలలో విద్యార్థిని మృతి సంఘటన సమాచారం తెలుసుకున్న ఏలూరు ఆర్డీవో అచ్యుత్ అంబరీష్, ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్, సీఐ విల్సన్, తహసీల్దార్ రమాదేవి కళాశాలను సందర్శించారు. తొలుత ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టిన బంధువులతో మాట్లాడారు. అనంతరం గురుకుల కళాశాలలో విచారణ నిర్వహించారు. బాలిక మృతిపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని డీఎస్పీ శ్రావణ్‌కుమార్ తెలిపారు.